టుడే అప్‌డేట్స్ | today updates | Sakshi
Sakshi News home page

టుడే అప్‌డేట్స్

Published Mon, Jan 9 2017 7:27 AM | Last Updated on Tue, Sep 5 2017 12:49 AM

today updates

  • నేటి నుంచి రెండు రోజులపాటు గుజరాత్‌లో పర్యటించనున్న ప్రధాని నరేంద్ర మోదీ
  • ఢిల్లీ: నేడు ఈసీని కలవనున్న ఎస్పీ నేత ములాయంసింగ్ యాదవ్. పార్టీ అధ్యక్షుడిని తానేనని అందుకు తగిన ఆధారాలు, డాక్యుమెంట్లు సమర్పించనున్న ములాయం
  • కర్నూలు జిల్లాలో ఐదో రోజుకు చేరిన వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర. నేడు లింగాపురం నుంచి ప్రారంభంకానున్న వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర. ఓంకారం, కడమలకాల్వ, వెంగళ్‌రెడ్డిపేటలో వైఎస్ జగన్ రోడ్ షో
  • జమ్ముకశ్మీర్: అఖ్నూర్ సెక్టార్ లోని ఆర్మీక్యాంపుపై ఉగ్రదాడి. భద్రతా బలగాలే లక్ష్యంగా ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు జవాన్ల మృతి. ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు కొనసాగుతున్న ఎదురుకాల్పులు
  • నేడు శబరిమలలో పర్యటించనున్న తెలంగాణ మంత్రి ఇంద్రకరణ్, చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు విద్యాసాగర్, విఠల్‌రెడ్డి. పంపా సంగమం కాన్ఫరెన్స్ లో పాల్గొననున్న ఇంద్రకరణ్ బృందం.
  • కృష్ణా జిల్లాలో నేడు కొండపావులూరులో ఎన్డీఆర్ఎఫ్ కేంద్రానికి శంకుస్థాపన. కార్యక్రమానికి హాజరుకానున్న కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, వెంకయ్యనాయుడు, సీఎం చంద్రబాబునాయుడు
  • నేడు పంజాబ్ కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళిక విడుదల చేయనున్న మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్
  • ఢిల్లీ: పొగమంచు కారణంగా 6 అంతర్జాతీయ, 7 డొమెస్టిక్ విమానాల రాకపోకలు ఆలస్యం. 41 రైళ్ల ఆలస్యం, 9 సర్వీసుల రీషెడ్యూలుతో పాటు 3 రైళ్లను రద్దుచేసిన రైల్వే అధికారులు
  • నేడు అనంతపురంలో పర్యటించనున్న రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర. గన్నవరం నుంచి బెంగుళూరుకు విమానంలో రానున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా పరిగిలో జరిగే జన్మభూమి మా ఊరులో పాల్గొంటారు. మధ్యాహ్నం కళ్యాణదుర్గంలో జన్మభూమి కార్యక్రమంలో ఆయన పాల్గొనున్నట్లు సమాచారం
  • భద్రాచలం: రామాలయంలో ఉత్తర ద్వారం నుంచి స్వామివారిని దర్శించుకుంటున్న భక్తులు
  • విశాఖ సింహాచలం దేవాలయంలో ఉత్తరద్వార దర్శనం. అప్పన్నస్వామి దర్శనం కోసం పోటెత్తిన భక్తులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement