ఢిల్లీ : రిపబ్లిక్ డే వేడుకలకు అతిథిగా విచ్చేసిన అబుదాబి యువరాజు నహ్యన్‌తో నేడు ప్రధాని మోదీ భేటీకానున్నారు. భారత్, యూఏఈ మధ్య వ్యూహాత్మక ఒప్పందాలపై చర్చ.
ఢిల్లీ : రిపబ్లిక్ డే సందర్భంగా జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ.
ఢిల్లీ : నేడు జాతీయ ఓటరు దినోత్సవం. దేశవ్యాప్తంగా ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో పలు అవగాహన కార్యక్రమాలు.
హైదరాబాద్ : ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేడు ఉదయం 11గంటలకు ప్రెస్‌మీట్ నిర్వహించనున్నారు. ప్రత్యేక హోదా, ప్రభుత్వ ఆంక్షలపై వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడతారు.
హైదరాబాద్ : నేటి నుంచి వచ్చే నెల 3 వరకు జేఈఈ దరఖాస్తుల్లో సవరణలకు అవకాశం
ఆంధ్రప్రదేశ్ : నేడు ఏపీ కేబినేట్ భేటీ. రాష్ట్రంలో అద్దె నియంత్రణ బిల్లు, విద్యుత్ పెంపు ప్రతిపాదనలపై చర్చ.
తెలంగాణ : నేటి నుంచి టీఎస్‌పీఎస్సీ గ్రూప్-2 దరఖాస్తులో సవరణలకు అవకాశం.
స్పోర్ట్స్ : ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో నేటి మ్యాచ్‌లు
ప్లిస్కోవా (చెస్ రిపబ్లిక్) vs మిర్యానా లుసిచ్(క్రొయేషియా)
సెరెనా విలియమ్స్ (అమెరికా) vs జొహనాకొంటా(బ్రిటన్)
గాఫిన్ (బెల్జియం) vs దిమిత్రోవ్(బల్గేరియా)
రాఫెల్ నాదల్ (స్పెయిన్) vs మిలోస్ రావ్‌నిచ్ (కెనడా).