టుడే అప్‌డేట్స్ | today updates | Sakshi
Sakshi News home page

టుడే అప్‌డేట్స్

Published Sat, Dec 31 2016 7:24 AM | Last Updated on Tue, Sep 5 2017 12:03 AM

today updates

  • నేటితో ముగియనున్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శీతాకాల విడిది. సాయంత్రం ఢిల్లీకి ప్రణబ్ తిరుగు పయనం
  • యూపీ: నేడు సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థులతో భేటీ కానున్న పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్. తాజా సంక్షోభం నేపథ్యంలో నేటి సమావేశానికి ప్రాధాన్యం
  • ఢిల్లీ: రద్దయిన పెద్ద నోట్లపై నేటి నుంచి అమల్లోకి ఆర్డినెన్స్. రద్దయిన నోట్లు ఉంటే జైలు శిక్ష నిబంధన తొలగింపు. రూ.10 వేలు జరిమానా విధించాలని నిర్ణయం
  • నేటి ఉదయం 9 గంటలకు లక్నోలో పార్టీ ఎమ్మెల్యేలతో భేటీకానున్న యూపీ సీఎం అఖిలేష్ యాదవ్
  • నేడు విజయవాడలో ఉదయం 10:30 గంటలకు ఏపీ కేబినెట్ భేటీ. జనవరి 2 నుంచి నిర్వహించే జన్మభూమి కార్యక్రమంపై చర్చ
  • ఓలా క్యాబ్‌ సంస్థకు వెళితే బౌన్సర్లతో క్యాబ్‌ డ్రైవర్లపై దాడి చేయించినందుకు నిరసనగా శుక్రవారం అర్ధరాత్రి నుండి జనవరి 4 వరకు తెలంగాణ వ్యాప్తంగా క్యాబ్‌ల బంద్‌. అసోసియేషన్‌లో ఉన్న ఏడు వేల మందితో పాటు అన్ని సంఘాల క్యాబ్‌ డ్రైవర్స్, ఓనర్స్‌ కూడా బంద్‌ లో పాల్గొననున్నారు
  • అమరావతి: నేడు ఆర్బీఐ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు రూ.2 వేల కోట్లు పంపిణీ
  • ఢిల్లీ: పొగమంచు కారణంగా 69 రైళ్ల ఆలస్యం, 16 రైళ్లు రీషెడ్యూల్. 4 రైళ్లను రద్దుచేసిన అధికారులు
  • నేటి ఉదయం జపాన్ తూర్పు తీరంలో భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.5గా నమోదు
  • రాష్ట్రంలోని గ్రూప్‌–3 కేటగిరీ పోస్టుల భర్తీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) శనివారం ప్రకటన విడుదల చేయనుంది.
  • చెన్నై: నేడు పార్టీ పగ్గాలు పుచ్చుకోనున్న మాజీ సీఎం జయలలిత నెచ్చెలి శశికళ. అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టనున్న శశికళ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement