టుడే అప్‌డేట్స్ | today updates | Sakshi
Sakshi News home page

టుడే అప్‌డేట్స్

Published Thu, Dec 22 2016 9:23 AM | Last Updated on Mon, Sep 4 2017 11:22 PM

today updates

  • దక్షిణాది రాష్ట్రాల శీతాకాల విడిదిలో భాగంగా నేడు హైదరాబాద్‌ రానున్న రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ. 22వ తేదీ నుంచి ఈ నెల 31 వరకు ఆయన బొల్లారంలో ఉన్న రాష్ట్రపతి నిలయంలో బస . నేటి సాయంత్రం 5.30కు ప్రత్యేక విమానంలో రాష్ట్రపతి ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు చేరుకుంటారు. ఈనెల 31 వరకు బొల్లారంలో శీతాకాల విడిది.
  •  

    • నేడు వారణాసిలో పర్యటించనున్న ప్రధాని నరేంద్ర మోదీ. 20 వేల మంది బూత్ లెవల్ కార్యకర్తలతో సమావేశం కానున్న ప్రధాని

     

    • నేడు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ను కలవనున్న మణిపూర్ బీజేపీ నేతల బృందం. పలు సమస్యలను రాజ్‌నాథ్ దృష్టికి తీసుకెళ్లనున్న పార్టీ నేతలు

     

    • హైదరాబాద్‌లో నేడు ఏపీ ప్రివిలేజ్ కమిటీ సమావేశం. హాజరుకానున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కొడాలి నాని, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, పిన్నెల్లి.

     

    • నేడు తెలంగాణ శాసనసభలో టీఎస్ ఐపాస్ పై చర్చ. నేడు తెలంగాణ శాసనమండలిలో వ్యవసాయరంగంపై కొనసాగనున్న చర్చ

     

    • చిత్తూరు జిల్లా తిరుమలలో పర్యటించిన లంక ప్రధాని విక్రమ సింఘె. నేటి ఉదయం శ్రీవారి ఆలయాన్ని సందర్శించిన విక్రమ సింఘె

     

    • అమరావతిలో నేడు రెండో రోజు కూడా కలెక్టర్లతో సమావేశం కానున్న సీఎం చంద్రబాబు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాల అమలుతీరుపై సమీక్ష

     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement