నేడు పీవీ సింధు, గోపిచంద్ ఉదయం 8.30గం.లకు గన్నవరం చేరుకోనున్నారు.
♦ నేడు విజయవాడకు పీవీ సింధు,గోపిచంద్, ఉదయం 8.30 గం. లకు గన్నవరం చేరుకోనున్న పీవీ సింధు గోపిచంద్, గన్నవరం నుంచి విజయవాడ వరకు విజయోత్సవ ర్యాలీ
♦ నేడు సీఎం చంద్రబాబు చేతుల మీదుగా సింధుకు సన్మానం, కృష్ణా హారతి కార్యక్రమానికి హాజరుకానున్న పీవీ సింధు
♦ నేడు బ్యారేజీలపై మహారాష్ట్రతో తుది ఒప్పందం చేసుకోనున్న టీఎస్ సర్కార్
♦ మహారాష్ట్రతో ఒప్పందాన్ని నిరసిస్తూ నేడు తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ కాంగ్రెస్ నిరసనలు
♦ నేడు హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం ఇవ్వనున్న టీపీసీసీ చీఫ్ ఉత్తమ్
♦ నేడు కడప-నంద్యాల రైలు ప్రారంభం, విజయవాడ నుంచి రిమోట్ వీడియో లింక్ ద్వారా ప్రారంభించనున్న సురేష్ ప్రభు
♦ నేడు 12వ రోజు కృష్ణా పుష్కరాలు, నేటితో ముగియనున్న పుష్కరాలు, తెలుగు రాష్ట్రాల్లో పుష్కర ఘాట్‌ల వద్ద పెరిగిన భక్తుల రద్దీ
♦ కృష్ణా పుష్కరాల ముగింపు సందర్భంగా తెలంగాణలో నేడు ప్రత్యేక కార్యక్రమాలు