- నేటి నుంచి మూడు రోజులపాటు సీపీఐ జాతీయ కార్యవర్గ సమావేశాలు. హైదరాబాద్‌లో నేడు ప్రారంభంకానున్న సమావేశాలు
- నేడు ఐదవరోజు కొనసాగనున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు. నేడు వ్యవసాయరంగంపై సభలో చర్చ
- నేడు ఢిల్లీలో ఉదయం 10 గంటలకు సమావేశం కానున్న కేంద్ర మంత్రివర్గం
- నేడు ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
- అమరావతిలో నేడు, రేపు కలెక్టర్లతో సీఎం చంద్రబాబు సమావేశం. క్షేత్రస్థాయిలో రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలు తీరుపై సమీక్ష
- మెక్సికోలో పెను విషాదం చోటుచేసుకుంది. ఓ బాణాసంచా తయారీ కేంద్రంలో మంగళవారం అర్ధరాత్రి తర్వాత భారీ పేలుడు సంభవించింది.
- పొగమంచు కారణంగా ఢిల్లీకి వెళ్లనున్న 32 రైళ్లు ఆలస్యం. మరో ఐదు రైళ్ల వేళలను రీషెడ్యూల్ చేసిన రైల్వే అధికారులు
- నెల్లూరు జిల్లా వెంకటాచలం వద్ద తెగిపడిన రైల్వే విద్యుత్ వైర్లు. దీంతో నేటి ఉదయం గూడూరు-నెల్లూరు మార్గంలో కొంత సమయం నిలిచిన రైళ్ల రాకపోకలు