పాత రూ.500 నోటు నేటి అర్ధరాత్రి వరకే చెల్లుబాటవుతుంది.
నేటితో ముగియనున్న ‘గూప్–2’ గడువు
♦ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గతనెలలో విడుదల చేసిన గ్రూప్–2 నోటిఫికేషన్‌కు సంబంధించి బుధవారం సాయంత్రం వరకు దాదాపు ఆరు లక్షలవరకు దరఖాస్తులు అందాయి. ఈ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తు గడువు గురువారం అర్ధరాత్రితో ముగియనుంది.
నేడు బీఏసీ సమావేశం
♦ శాసనసభ శీతాకాల సమావేశాల(ఆరో సెషన్) నిర్వహణపై చర్చించేందుకు బీఏసీ(బిజినెస్ అడ్వైజరీ కమిటీ) గురువారం భేటీ కానుంది. ఉదయం 11 గంటలకు స్పీకర్ మధుసూదనాచారి అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఈసారి అసెంబ్లీ సమావేశాలను కనీసం 10 రోజుల పాటు జరపాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది.
రూ.500 పాతనోటుకు నేటితో రాంరాం
♦ పాత రూ.500 నోటు నేటి అర్ధరాత్రి వరకే చెల్లుబాటవుతుంది. అదీ ప్రభుత్వ సర్వీసుల చెల్లింపుల్లో, మెడికల్ షాపుల్లోనే. రూ.500 నోట్లతో మొబైల్ రీచార్జి సదుపాయానికి అవకాశం ఉండదు. ఈ నోట్ల వినియోగానికి ఇచ్చిన డిసెంబర్ 15 గడువును ఎట్టి పరిస్థితుల్లోనూ పొడిగించరాదని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఇక ప్రజలు తమ వద్ద ఉన్న పాత రూ.500 నోట్లను బ్యాంకుల్లో మాత్రమే డిపాజిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ‘పాత రూ.500 నోట్ల వినియోగానికి ఇచ్చిన మినహాయింపులు డిసెంబర్ 15వ తేదీ అర్ధరాత్రితో ముగుస్తాయి’ అని కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి శక్తికాంతదాస్ బుధవారం ట్వీట్ చేశారు.
మధ్యాహ్నం 2:30గం.లకు ఏపీ కేబినెట్ భేటీ
♦ పెద్దనోట్ల రద్దు, చిల్లర కొరత, నగదు రహిత లావాదేవీలు..నాలా పన్ను, స్మార్ట్ సిటీల కోసం ఎన్‌సీపీల ఏర్పాటు పై చర్చించే అవకాశం
♦ హైదరాబాద్: ఉదయం 9 గంటలకు సీఎల్పీ సమావేశం
అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహం పై కసరత్తు
♦న్యూఢిల్లీ: ఉ.9:30 గంటలకు పార్లమెంట్‌లో ప్రతిపక్షాల సమావేశం
♦ వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్ టోర్నీలో ఇవాళ రెండో రౌండ్
చైనా షట్లర్ సున్ యుతో తలపడనున్న పీవీ సింధు
♦ లక్నో: జూనియర్ పురుషుల హాకీ ప్రపంచ కప్
ఇవాళ క్వార్టర్ ఫైనల్లో స్పెయిన్‌తో తలపడనున్న భారత్