- నేడు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ. తిరుమలలో శ్రీవారిని దర్శించుకోనున్న ప్రణబ్. తిరుమలేశుని దర్శనానంతరం తిరిగి పద్మావతి అతిథి గృహానికి చేరుకుంటారు. సాయంత్రం 4.10గంటలకు రేణిగుంట విమానాశ్రయం నుంచి హైదరాబాద్‌కు పయనమవుతారు
- నేడు ఢిల్లీలో సమావేశం కానున్న కేంద్ర మంత్రివర్గం
- నేడు మద్రాస్ హైకోర్టులో మాజీ సీఎం జయలలిత మరణంపై వేసిన పిటిషన్‌పై విచారణ జరుగుతుంది. జయలలిత మరణంపై విచారణ జరిపించాలని అన్నాడీఎంకే కార్యకర్తల పిటిషన్
- నేడు అనంతరపురం జేఎన్‌టీయూ ఎనిమిదవ స్నాతకోత్సవం. షార్ డైరెక్టర్ పి.కున్నికృష్ణన్‌కు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయనున్న యూనివర్సిటీ
- డీమానిటైజేషన్‌పై నేడు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం
- తిరుపతి: డాక్టర్ గుణశేఖర్ యాదవ్ ఇంటిపై ఐటీ సోదాలు. మంగళవారం రాత్రి నుంచి కొనసాగుతున్న తనిఖీలు. ఏపీ మంత్రి నారాయణకు గుణశేఖర్ యాదవ్ అత్యంత సన్నిహితుడు.
- ఉత్తరప్రదేశ్ లోని కాన్పుర్ సమీపంలో సెల్దా-అజ్మీర్ ఎక్స్‌ప్రెస్ రైలుకు ప్రమాదం.. 14 బోగీలు పట్టాలు తప్పడంతో ట్రెయిన్ గార్డు సహా పలువురు ప్రయాణికులకు గాయాలు
టుడే అప్‌డేట్స్
Published Wed, Dec 28 2016 8:07 AM | Last Updated on Mon, Sep 4 2017 11:49 PM
Advertisement
Advertisement