టుడే న్యూస్‌ అప్‌డేట్స్‌ | today news updates | Sakshi
Sakshi News home page

టుడే న్యూస్‌ అప్‌డేట్స్‌

Published Fri, May 5 2017 8:29 AM | Last Updated on Tue, Sep 5 2017 10:28 AM

today news updates

నల్లగొండ జిల్లాలో పర్యటించనున్న గవర్నర్‌
నల్లగొండ: నేడు నల్లగొండ జిల్లాలో పర్యటించనున్న గవర్నర్‌ నరసింహన్‌. మహాత్మాగాంధీ వర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొననున్న గవర్నర్‌. అనంతరం ప్రభుత్వాసుపత్రిని సందర్శించనున్న గవర్నర్‌ నరసింహన్‌.

నిర్భయ కేసుపై నేడు సుప్రీంకోర్టు తీర్పు
న్యూఢిల్లీ: నిర్భయ కేసుపై నేడు సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వనుంది. నలుగురు నిందితులకు ఉరిశిక్ష విధించిన కింది కోర్టులు. శిక్షలను సవాల్‌ చేస్తూ నిందితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 2012 డిసెంబర్‌ 16న యువతిపై ఆరుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కాగా, ఆరుగురిలో ఓ నిందితుడు శిక్ష అనుభవిస్తూ జైల్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు. మైనర్‌ కావడంతో శిక్ష అనుభవించి బయటకొచ్చిన మరో నిందితుడు

ఖమ్మం మిర్చి యార్డ్‌ ను సదర్శించనున్న కిషన్‌ రెడ్డి
ఖమ్మం: ఇటీవల రైతుల ఆగ్రహానికి గురైన ఖమ్మం మిర్చి యార్డ్‌ ను శుక్రవారం బీజేపీ నేత కిషన్‌ రెడ్డి సందర్శించనున్నారు. మిర్చి యార్డ్‌ ధ్వంసం కేసుల్లో జైల్లో ఉన్న రైతులను పరామర్శించనున్న కిషన్‌ రెడ్డి

హైదరాబాద్‌ లో పీసీసీ విస్తృతస్థాయి సమావేశం
హైదరాబాద్‌: శుక్రవారం సాయంత్రం 4 గంటలకు పీసీసీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. కాంగ్రెస్‌ పార్టీ సభ్యత్వ నమోదు, సంస్థాగత అంశాలపై నేతలు చర్చిస్తారు. ఈ సమావేశంలో పాల్గొననున్న ఏఐసీసీ కార్యదర్శి కుంతియా

నేడు అంతరిక్షంలోకి జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌09
శ్రీహరికోట(సూళ్లూరుపేట): భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన సతీష్‌ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌)లోని రెండో ప్రయోగ వేదిక నుంచి శుక్రవారం సాయంత్రం 4.57 నిమిషాలకు జీఎస్‌ ఎల్‌వీ ఎఫ్‌09 ఉపగ్రహ వాహక నౌకను ప్రయోగించనున్నారు. దీనికి సంబంధించి గురువారం మధ్యాహ్నం 12.57 నిమిషాలకు కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది. ఈ రాకెట్‌ ద్వారా 2,230 కిలోల బరువు కలిగిన విశాట్‌–9(దక్షిణాసియా దేశాల శాటిలైట్‌) ఉపగ్రహాన్ని భూమికి 36వేల కి.మీ ఎత్తులోని భూస్థిర కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు. దక్షిణాసియా దేశాలైన శ్రీలంక, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, భారత్, మాల్దీవులు దేశాలకు ఈ ఉపగ్రహం 12 ఏళ్లపాటు సేవలందించనుంది.

నేడు ఏపీఎంసెట్‌ ఫలితాలు
అమరావతి: రాష్ట్రంలోని ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా కోర్సుల్లో ప్రవేశాలకు గాను ఏపీ ఎంసెట్‌–2017 ఫలితాలు శుక్రవారం విడుదల కానున్నాయి. మంత్రులు గంటా శ్రీనివాస రావు, కామినేని శ్రీనివాస్, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విజయవాడలో మధ్యాహ్నం 3 గంటలకు ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని ఎంసెట్‌ కన్వీనర్‌  సీహెచ్‌ సాయిబాబు గురువారం మీడియాకు వెల్లడించారు. ర్యాంకుల సమాచారాన్ని ఆయా అభ్యర్థుల ఫోన్‌ నంబర్లకు పంపిస్తామని తెలిపారు.

‘గురుకుల’ దరఖాస్తు గడువు పెంపు
హైదరాబాద్‌: గురుకుల టీచర్‌ పోస్టుల భర్తీకి చేపట్టిన దరఖాస్తుల ప్రక్రియలో భాగంగా ఈ నెల 4, 6 వరకు ఉన్న దరఖాస్తుల గడువును 9 వరకు పొడిగించినట్లు టీఎస్‌పీఎస్సీ తెలిపింది. 9 రకాల నోటిఫికేషన్లకు అభ్యర్థులు 9 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌(పీఈటీ) పోస్టులకు నిర్ణీత అర్హతలుంటే సరిపోతుంది. స్కూల్‌/కాలేజీ/జిల్లాస్థాయి గేమ్స్‌/ స్పోర్ట్స్‌లో పాల్గొన్న సర్టిఫికెట్‌ ఉండాలన్న నిబంధనను తొలగించింది.

ఐపీఎల్‌-10 షెడ్యూలు
బెంగళూరు: రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో తలపడనున్న కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌. బెంగళూరు వేదికగా రాత్రి 8 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం అవుతుంది. పరువు కోసం కోహ్లీసేన తాపత్రయం. పాయింట్లు మెరుగు పరుచుకోవాలని భావిస్తున్న పంజాబ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement