టుడే న్యూస్‌ అప్‌డేట్స్ | News updates for the day of 24th January 2017 | Sakshi
Sakshi News home page

టుడే న్యూస్‌ అప్‌డేట్స్

Published Tue, Jan 24 2017 8:29 AM | Last Updated on Tue, Sep 5 2017 2:01 AM

News updates for the day of 24th January 2017

ఢిల్లీ : ఇవాళ ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినేట్ సమావేశం. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్‌తో పాటు పలు కీలక అంశాలపై చర్చ.
ఢిల్లీ : నేడు చంద్రబాబు నేతృత్వంలోని ముఖ్యమంత్రుల కమిటీ ప్రధాని మోదీని కలవనున్నారు. నగదు రహిత లావాదేవీలపై ప్రధానికి నివేదిక.


హైదరాబాద్ : ఇవాళ తెలంగాణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఫీజు పోరు ధర్నా. ఇందిరాపార్క్ వద్ద 4వేల మంది విద్యార్థులతో ఆందోళన.
తెలంగాణ : నేడు నిజామాబాద్ జిల్లాలో ఎంపీ కవిత పర్యటిస్తారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారు.


ఆంధ్రప్రదేశ్ : కర్నూలులో నేటి నుంచి రెండు రోజుల పాటు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం. మంత్రులు కామినేని శ్రీనివాస్‌, పైడికొండల మాణిక్యాలరావు సహా పార్టీ ముఖ్యనేతలు, కార్యకర్తలు హాజరుకానున్నారు.

ఆంధ్రప్రదేశ్‌ : ఏపీ ప‍్రభుత్వం వంశధార నిర్వాసితులకు నేడు చెక్కుల పంపిణీ చేయనుంది. ఈ మేరకు ఆర్థిక శాఖ రూ.150 కోట్లు మంజూరు చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement