- నేడు ఢిల్లీలో దీక్ష చేయనున్న ఉత్తరాఖండ్ సీఎం హరీష్ రావత్. ఉత్తరాఖండ్ అభివృద్ధిపై కేంద్రం చిన్నచూపు చూస్తోందని సీఎం ఆరోపణ
- నేటి నుంచి కర్నూలు జిల్లాలో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రైతు భరోసా యాత్ర. శ్రీశైలం నుంచి ప్రారంభమయ్యే ఈ భరోసా యాత్ర మొదటి విడతలో శ్రీశైలం, నంద్యాల నియోజకవర్గాల్లో జరగనుంది. అప్పుల బాధతో, రుణమాఫీ అమలుకాక ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ఈ సందర్భంగా ఆయన భరోసా ఇవ్వనున్నారు.
- నేడు విజయవాడలో ఏపీ కాంగ్రెస్ విస్తృతస్థాయి సమావేశం. నోట్లరద్దు సమస్యలు, నల్లధనం వెలికితీతపై చర్చ
- నేడు తిరుపతిలో కొనసాగనున్న ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశాలు
- నేడు జమ్ముకశ్మీర్లో పర్యటించనున్న నూతన ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్
- నేడు హైదరాబాద్‌లో టీకాంగ్రెస్ నేతల నిరసన ర్యాలీ. చార్మినార్ నుంచి అబిడ్స్ వరకు ర్యాలీ చేపట్టనున్న కాంగ్రెస్. నోట్ల రద్దు సమస్యలను పరిష్కరించాలని డిమాండ్
- నేడు తూర్పుగోదావరి జిల్లాలో సీఎం చంద్రబాబునాయుడు పర్యటన. పురుషోత్తమపట్నం ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన
- నేటి నుంచి తెలంగాణలో విజయ డెయిరీ పాల ధర పెంపు. లీటర్ పాలపై రూ.2 పెంపు
- హైదరాబాద్: నేడు ఆరో రోజుకు చేరిన క్యాబ్ డ్రైవర్ల ఆందోళన. మణికొండ సర్పంచ్ ఆఫీసులో దీక్ష కొనసాగిస్తున్న ఉబర్, ఓలా డ్రైవర్-ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శివ
- ఢిల్లీ: పొగమంచు కారణంగా 70 రైళ్లు ఆలస్యం. 22 రైళ్ల వేళలను రీషెడ్యూలు. 7 సర్వీసులను రద్దుచేసిన రైల్వే అధికారులు
- ఆస్ట్రేలియా ఆర్మీ సాయాన్ని తాత్కాలికంగా రద్దుచేసుకున్న ఇండోనేషియా ప్రభుత్వం
- నేడు తెలంగాణాలో విద్యాసంస్థల బంద్‌కు ఎన్‌ఎస్‌యూఐ పిలుపు. ఫీజు రీయింబర్స్ మెంట్ పై ప్రభుత్వ వైఖరికి నిరసనగా బంద్‌కు పిలుపునిచ్చిన ఎన్‌ఎస్‌యూఐ
టుడే అప్‌డేట్స్
Published Thu, Jan 5 2017 7:41 AM | Last Updated on Tue, Sep 5 2017 12:30 AM
Advertisement
Advertisement