నేటి వార్తా విశేషాలు | today updates | Sakshi
Sakshi News home page

నేటి వార్తా విశేషాలు

Published Sat, May 6 2017 8:33 AM | Last Updated on Tue, Sep 5 2017 10:34 AM

today updates

ఉత్తరాఖండ్‌ లో రాష్ట్రపతి పర్యటన
డెహ్రాడూన్‌: ఉత్తరాఖండ్‌ లో రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ పర్యటించనున్నారు. రాష్ట్రంలోని ప్రసిద్ధ బద్రినాథ్‌ ఆలయంలో ప్రణబ్‌ ముఖర్జీ ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.

లక్నోలో సీఎం యోగి స్వచ్ఛ్‌ భారత్‌
లక్నో: స్వచ్ఛ్‌ భారత్‌ కార్యక్రమంలో పాల్గొననున్న యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌. లక్నో లోని బాలు అడ్డా మాలిన్‌ బస్తీలో స్వయంగా చీపురు పట్టి ఊడ్చి అవగాహన కల్పించనున్న సీఎం యోగి.

జపాన్‌ పర్యటనకు అరుణ్‌ జైట్లీ
న్యూఢిల్లీ: మూడు రోజుల పర్యటనలో భాగంగా జపాన్‌కు వెళ్లనున్న కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీ. పలు వ్యాపార సంబంధ కార్యక్రమాలలో పాల్గొని జపాన్‌ అధికారులతో భేటీ కానున్న జైట్లీ

నేడు టీఎస్‌ ఈసెట్‌-2017
హైదరాబాద్‌: టీఎస్‌ ఈసెట్‌-2017 పరీక్షకు సర్వం సిద్ధమైంది. శనివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌ పద్ధతిలో నిర్వహించే ఈ పరీక్షకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 25,138 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నారు.

నేడు పాలీసెట్‌ ఫలితాలు
హైదరాబాద్‌: పాలిటెక్నిక్‌ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పాలీసెట్‌ 2017 పరీక్ష ఫలితాలను 6వ తేదీన విడుదల చేసేందుకు రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ మండలి (ఎస్‌బీటీఈటీ) ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ ఫలితాలను ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి విడుదల చేయనున్నారు. నాంపల్లిలోని రూసా సమావేశ మందిరంలో ఉదయం 11 గంటలకు ఫలితాలను విడుదల చేస్తారు. గత నెల 22న నిర్వహించిన ఈ పరీక్షకు దాదాపు 1.3 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.
 

నేడు ఏపీ టెన్త్‌ ఫలితాలు విడుదల
అమరావతి: పదో తరగతి పరీక్ష ఫలితాలు శనివారం విడుదలవుతాయని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ వీఎస్‌ భార్గవ తెలిపారు. విశాఖపట్నం ఆంధ్రా యూనివర్సిటీలోని డాక్టర్‌ వైవీఎస్‌ మూర్తి ఆడిటోరియంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ఈ ఫలితాలను విడుదల చేస్తారని ప్రకటించారు. కాగా, ఈ ఫలితాలను www.sakshi.com , www.sakshieducation.com వెబ్‌సైట్‌లో కూడా పొందవచ్చు.

ఐపీఎల్‌ షెడ్యూలు
సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ తో తలపడనున్న రైజింగ్‌ పుణే సూపర్‌ జెయింట్‌. సాయంత్రం 4 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం
ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌ తో తలపడనున్న ముంబై ఇండియన్స్‌. రాత్రి 8 గంటలకు మ్యాచ్‌ ఆరంభం

అజ్లాన్‌ షా హాకీ టోర్నమెంట్‌
టోర్నీలో భాగంగా నేటి మ్యాచ్‌ లో న్యూజిలాండ్‌ తో తలపడనున్న భారత్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement