♦ తూర్పు గోదావరి జిల్లాలో రెండో రోజు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. వరా రామచంద్రాపురంలో కాళ్లవాపు వ్యాధితో మృతిచెందిన వారి కుటుంబాలను జగన్ పరామర్శించనున్నారు. అనంతరం రేఖపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పోలవరం నిర్వాసితుల సమస్యలపై మాట్లాడతారు.
♦ సీఎం కేసీఆర్ గురువారం ఢిల్లీలో జరగనున్న కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కూతురి వివాహ రిసెప్షన్ కార్యక్రమానికి హాజరుకానున్నారు. అలాగే పలువురు కేంద్ర మంత్రులను కలుసుకుంటారు.అపాయింట్‌మెంట్ లభిస్తే ప్రధాని మోదీతో భేటీ అవుతారు.
♦ ఏపీ వైపు తుపాను దూసుకు వస్తోంది. ఆగ్నేయ బంగాళా ఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం బుధవారం సాయంత్రం వరకు స్థిరంగా ఉంది. ఆ తర్వాత నుంచి ఉత్తర దిశగా నెమ్మదిగా కదులుతూ బుధవారం రాత్రికి విశాఖపట్నానికి ఆగ్నేయంగా 1,160, మచిలీపట్నానికి తూర్పు ఆగ్నేయ దిశగా 1,220 కిలోమీటర్ల దూరంలోనూ కేంద్రీకృతమై ఉంది. ఇది గురువారం ఉదయానికి తీవ్ర వాయుగుండంగా మారనుంది. అనంతరం మరో 24 గంటల్లో (శుక్రవారం నాటికి) తుపానుగా మారుతుందని భారత వాతావరణ విభాగం బుధవారం రాత్రి బులెటిన్‌లో వెల్లడించింది.
♦ ముంబై: నేటి నుంచి భారత్, ఇంగ్లండ్ మధ్య నాలుగో టెస్ట్ మ్యాచ్. ఉదమం 9.30గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
♦ లక్నో: నేటి నుంచి జూనియర్ ప్రపంచ కప్ హాకీ టోర్నమెంట్
♦ గుంటూరు: నేడు అధికారులు, వైద్యులతో వర్క్ షాప్
స్వాస్థ్య విద్యా వాహినిపై అవగాహన కార్యక్రమం
♦ పెద్ద నోట్లు రద్దయి నేటికి నెల
బ్యాంకులు, ఏటీఎంల వద్ద భారీ క్యూలైన్లు
నగదులేక గ్రామీణుల అవస్థలు
పడిపోయిన వ్యాపారాలు
వృద్ధిరేటు తగ్గించిన ఆర్బీఐ
ప్రజల్లో పెరుగుతున్న అసహనం
టుడే న్యూస్ అప్ డేట్స్
Published Thu, Dec 8 2016 7:27 AM | Last Updated on Mon, Sep 4 2017 10:14 PM
Advertisement
Advertisement