ఢిల్లీ : నేడు ప్రధాని మోదీని తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం కలవనున్నారు. జల్లికట్టుపై ఆర్డినెన్స్ జారీ చేయాలని మోదీని కోరనున్న సెల్వం.
ఆంధ్రప్రదేశ్ : ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి ప్రాంత గ్రామాల్లో ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటించనున్నారు. రాజధానికి భూములు ఇచ్చిన రైతుల సమస్యలపై నిడమర్రు, లింగాయపాలెం గ్రామాల్లో వైఎస్ జగన్ ముఖాముఖి.
ఆంధ్రప్రదేశ్ : కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న ఉద్దానంలో నేడు అధికారుల బృందం పర్యటన.
తెలంగాణ : పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై తెలంగాణ మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ల వద్ద ఆందోళనలు.
స్పోర్ట్స్ : నేడు కటక్‌లో మధ్యాహ్నం 1.30 గంటలకు భారత్, ఇంగ్లండ్ మధ్య రెండో వన్డే. ఇప్పటికే మూడు వన్డేల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో భారత్.
స్పోర్ట్స్ : నేడు ప్రొ రెజ్లింగ్ లీగ్-2 ఫైనల్ మ్యాచ్‌లో హరియాణాతో తలపడనున్న పంజాబ్ రాయల్స్.
టుడే న్యూస్ అప్ డేట్స్
Published Thu, Jan 19 2017 8:28 AM | Last Updated on Tue, Sep 5 2017 1:37 AM
Advertisement
Advertisement