టుడే అప్‌డేట్స్ | today updates | Sakshi
Sakshi News home page

టుడే అప్‌డేట్స్

Published Wed, Jan 4 2017 7:27 AM | Last Updated on Tue, Sep 5 2017 12:24 AM

today updates

  • ఢిల్లీ: నేడు సుప్రీంకోర్టు కొత్త సీజేఐగా బాధ్యతలు స్వీకరించనున్న జస్టిస్ జగదీష్‌సింగ్ ఖేహర్
  • హైదరాబాద్‌: పదవీ విరమణ పొందిన తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌చంద్రకు సచివాలయంలో బుధవారం వీడ్కోలు సమావేశం నిర్వహించనున్నారు. డీ బ్లాక్‌లోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో మధ్యాహ్నం 3.30 గంటలకు ఈ కార్యక్రమం నిర్వహణ.
  • చెన్నై: రాష్ట్ర రాజకీయాల్లో నేడు పలు కీలక సమావేశాలు జరగనున్నాయి. రాష్ట్ర కేబినెట్ బుధవారం అత్యవసర సమావేశం నిర్వహించనుంది. సీఎం పన్నీర్ సెల్వం నేతృత్వంలో ఉదయం 9.30 గంటలకు మంత్రి వర్గ సభ్యులు భేటీకానున్నారు. పార్టీ చీఫ్ శశికళ ముఖ్యమంత్రి అని వదంతులు వస్తున్న నేపథ్యంలో దీనిపై కేబినేట్ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు.
  • తమిళనాడులో ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకే పార్టీ సర్వ సభ్య సమావేశం నేడు జరగనుంది. అన్నా అరివాలయంలోని డీఎంకే రాష్ట్ర కార్యాలయంలో జరిగే ఈ సమావేశానికి రెండు నెలల అనంతరం డీఎంకే అధినేత ఎం.కరుణానిధి హాజరుకానున్నారు. ఈ సమావేశంలో పార్టీ కోశాధికారి, ప్రధాన ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్ కు నిర్వాహక అధ్యక్ష పగ్గాలు అప్పగించే అవకాశముంది.
  • నేడు భారత్‌కు రానున్న గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్. ఢిల్లీలో స్మాల్ అండ్ మిడియం ఎంటర్ ప్రైజెస్ ఈవెంట్లో పాల్గొననున్న పిచాయ్
  • క్యాబ్‌ డ్రైవర్ల సమస్యల పరిష్కారం కోసం బుధవారం నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు తెలంగాణ క్యాబ్‌ డ్రైవర్స్‌ అండ్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌ ప్రకటించింది. బుధవారం ఉదయం 9 గంటలకు గన్‌పార్కు అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించి.. భారీ క్యాబ్‌ ర్యాలీతో ఇందిరా పార్కుకు చేరుకుంటామని, ధర్నా చౌక్‌ వద్ద ఆమరణ దీక్ష చేపడతామని అసోసియేషన్‌ అధ్యక్షుడు శివ ఉల్‌కొందూల్కర్‌ తెలిపారు.
  • కోల్ కతా: నేడు ధర్నాలకు పిలుపునిచ్చిన సీఎం మమతా బెనర్జీ. ఎంపీ సుదీప్ అరెస్ట్ కు వ్యతిరేఖంగా న్యాయపోరాటానికి సిద్ధమైన టీఎంసీ నేతలు.
  • హైదరాబాద్: నేడు ఆలస్యంగా బయలుదేరనున్న తెలంగాణ ఎక్స్ ప్రెస్ రైలు. సాయంత్రం 6:25 గంటలకు బయలుదేరనున్న ఎక్స్ ప్రెస్ రైలు
  • చిత్తూరు జిల్లా తిరుపతిలో నేడు రెండో రోజు కొనసాగనున్న ఇండియన్ సైన్స్ కాంగ్రెస్
  • తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు. ఉభయ సభల్లో ఫీజు రీయింబర్స్ మెంట్ పై చర్చ జరగనుంది
  • నేడు దేశ రాజధాని ఢిల్లీలో ప్రి బడ్జెట్ సమావేశం నిర్వహించనున్నారు. నేడు జీఎస్‌టీ కౌన్సిల్ సమావేశం
  • నేటి సాయంత్రం 6 గంటలకు పార్టీ నేతలతో ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ భేటీ. హాజరుకానున్న రాష్ట్రాల ఇంఛార్జ్‌లు, ప్రధాన కార్యదర్శులు
  • త్వరలో ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది.
  • ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్: నేటి మ్యాచ్‌లో హైదరాబాద్ హంటర్స్ వర్సెస్ రాకెట్స్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement