- నేడు ప్రధాని మోదీతో అన్నాడీఎంకే ప్రతినిధి బృందం భేటీ. జల్లికట్టుపై ఆర్డినెన్స్ తీసుకురావాలని విజ్ఞప్తి చేయనున్న నేతలు
- పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీలోని ఓ స్డేడియంలో సమావేశాన్ని నిర్వహించనున్న కాంగ్రెస్ నేతలు
- నేడు విజయనగరం జిల్లాలో సీఎం చంద్రబాబునాయుడు పర్యటన. ముందస్తుగా మానవహక్కుల వేదిక జిల్లా కన్వినర్ జయశ్రీ హౌస్ అరెస్ట్. గండికోట ముంపువాసుల పరిహారం కోసం ఐదురోజులు దీక్ష చేసిన కన్వినర్ జయశ్రీ
- నేడు ఆసిఫాబాద్, ఖానాపూర్ నియోజకవర్గాల్లో మంత్రి హరీష్‌రావు పర్యటన. కుమ్రంభీం ప్రాజెక్టు కాల్వ పనులను పరిశీలించనున్న హరీష్. చదర్‌మట్ ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేయనున్న మంత్రి హరీష్
- అమరావతి: సంక్రాంతి పండుగ దృష్ట్యా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే విశాఖ, తిరుపతి, కాకినాడలకు ఏడు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు సీపీఆర్‌వో ప్రకటించారు. నేడు రైలు నెం.07449 సికింద్రాబాద్-కాకినాడ పోర్టు(వయా భీమవరం), హైదరాబాద్-తిరుపతి-హైదరాబాద్(02764, 02763) సర్వీసులు నడుస్తాయని చెప్పారు.
- విజయనగరం: నేడు బోగాపురం ఎయిర్‌పోర్టుపై ప్రజాభిప్రాయ సేకరణ. ప్రజాభిప్రాయ సేకరణ నేపథ్యంలో పలువురు వామపక్ష నేతల ముందస్తు అరెస్ట్
- ఢిల్లీ: పొగమంచు కారణంగా 26 రైళ్లు ఆలస్యం, 7 రైళ్లు రీ షెడ్యూల్ చేసిన రైల్వేశాఖ. 11 రైలు సర్వీసులు రద్దు. 5 డొమెస్టిక్ సర్వీసులు, ఒక అంతర్జాతీయ విమాన సర్వీసులు ఆలస్యం.
- నేటి నుంచి 14 వరకు రోడ్డు భద్రతా వారోత్సవాలు
- సంక్రాంతి పర్వదినం నేపథ్యంలో నేటి నుంచి 17 వరకు శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు.
టుడే అప్‌డేట్స్
Published Wed, Jan 11 2017 7:32 AM | Last Updated on Tue, Sep 5 2017 1:01 AM
Advertisement
Advertisement