టుడే అప్‌డేట్స్ | today updates | Sakshi
Sakshi News home page

టుడే అప్‌డేట్స్

Published Thu, Jan 12 2017 7:27 AM | Last Updated on Tue, Sep 5 2017 1:06 AM

today updates

  • అమరావతి: తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వం గురువారం అమరావతికి రానున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు ఆయన వెలగపూడి సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబును కలవనున్నట్లు ఆయన కార్యాలయ వర్గాలు తెలిపాయి. తమిళనాడుకు తెలుగు గంగ నీటిని విడుదల చేయాలని కోరేందుకు ఆయన వస్తున్నారు.
  • విజయవాడలో నేటి నుంచి మూడు రోజులపాటు ఎయిర్ షో. ఇందులో పాల్గొననున్న బ్రిటన్‌కు చెందిన నాలుగు ఎయిర్‌క్రాఫ్ట్‌లు. కార్యక్రమానికి హాజరుకానున్న కేంద్రమంత్రులు అశోక్ గజపతిరాజు, బండారు దత్తాత్రేయ, సీఎం చంద్రబాబునాయుడు
  • నేడు ముంబైలో రెండో స్కార్పీన్ క్లాస్ సబ్‌మెరైన్ ను ప్రారంభించనున్న భారత్
  • నేడు జాతీయ యువజన దినోత్సవం. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని 1984లో జనవరి12ను జాతీయ యువజన దినోత్సవంగా ప్రకటించిన అప్పటి కేంద్ర ప్రభుత్వం
  • నేటి నుంచి తెలంగాణలో కాంట్రాక్ట్ లెక్చరర్ల ఆమరణ దీక్ష
  • నేడు కృష్ణాజిల్లా గన్నవరం ఎయిర్‌పోర్టులో నూతన టెర్మినల్ ప్రారంభం
  • విజయనగరం: నేడు భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టుపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనున్న అధికారులు
  • కాకినాడలో నేటి నుంచి నాలుగు రోజులపాటు జరగనున్న బీచ్ ఫెస్టివల్ ప్రారంభం
  • ముంబైలో నేడు రెండో వార్మప్ మ్యాచ్. ఇంగ్లండ్ ఎలెవన్‌తో తలపడనున్న భారత్-ఏ టీమ్
  • వరంగల్: నేటి నుంచి మూడు రోజులపాటు ఐనవోలు మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాలు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement