- నేడు బెంగళూరులో జరిగే 89వ భారత్ బంగా సాహిత్య సమ్మేళనం కార్యక్రమానికి హాజరుకానున్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ
- క్రిస్మస్ పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని క్రైస్తవులందరికీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు
- నేడు మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి జన్మదినం సందర్భంగా హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసిన పార్టీ నేతలు
- వైఎస్ఆర్ జిల్లాలో కొనసాగుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన. నేడు జిల్లాలో జరిగే క్రిస్మస్ వేడుకలకు హాజరుకానున్న వైఎస్ జగన్
- న్యూఢిల్లీ: నేటి నుంచి డిజిటల్ లక్కీ డ్రా ప్రారంభం. నేటి నుంచి 100 రోజులపాటు ప్రతిరోజు, ప్రతివారం లక్కీ డ్రాలు తీస్తారు
- నేటి ఉదయం 11 గంటలకు రేడియో కార్యక్రమం మన్ కీబాత్‌లో ప్రసంగించనున్న ప్రధాని మోదీ
- నేడు గుంటూరులో పర్యటించనున్న ఏపీ సీఎం చంద్రబాబు. పెదకాకాని క్రిస్మస్ వేడుకల్లో పాల్గొననున్న చంద్రబాబు
- నేడు హైదరాబాద్ లో సమావేశం కానున్న టీజేఏసీ నేతలు. తెలంగాణ ప్రభుత్వ ప్రజా వ్యతిరేఖ విధానాలపై కార్యాచరణ ఉంటుందన్న జేఏసీ చైర్మన్ కోదండరామ్
- సిద్ధిపేట జిల్లాలో నేడు కొమురవెల్లి మల్లన్న కల్యాణ మహోత్సవం. తోటబావి కల్యాణ మండపం వద్ద ఏర్పాట్లు పూర్తి. ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్న మంత్రులు హరీశ్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి
- నేడు క్రిస్మస్ పర్వదినం సదర్భంగా మెదక్ సీఎస్ఐ చర్చిలో ఘనంగా క్రిస్మస్ వేడుకల నిర్వహణ
- విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్డేడియంలో కొనసాగుతోన్న కూచిపూడి నాట్యోత్సవాలు. నేడు ఏడు వేల మందితో మహా బృంద నాట్యం. 'జయము జయము' గీతానికి గిన్నిస్ రికార్డ్ దక్కే అవకాశం