- నేడు ఢిల్లీలో మూడోరోజు కొనసాగనున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాలు
- పెద్దనోట్ల రద్దుతో దేశవ్యాప్తంగా తలెత్తిన పరిస్థితులపై తెలంగాణ సీఎం కేసీఆర్, ప్రధాని నరేంద్ర మోదీతో గురువారం ఫోన్‌లో మాట్లాడారు. శుక్రవారం ఢిల్లీకి రావాలని కేసీఆర్‌ను ఆహ్వానించారు. చర్చలకు అందుబాటులో ఉండాలని, ఇప్పుడున్న పరిస్థితుల్లో అవలంబించాల్సిన పంథాను లిఖిత పూర్వకంగా అందించాలని సీఎంను కోరారు. ఈ నేపథ్యంలో శుక్రవారం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లనున్నారు. కేసీఆర్ శనివారం ప్రధానితో భేటీ కానున్నట్లు సమాచారం.
- నేటి నుంచి పాత నోట్ల మార్పిడిపై పరిమితి తగ్గింపు. ఇకపై రోజుకు రూ.4500 నుంచి నోట్ల మార్పిడిని రూ.2000కు తగ్గించిన కేంద్ర ప్రభుత్వం
- నేడు లోక్‌సభలో చర్చకు రానున్న ఎంపీ వినోద్ ప్రైవేట్ మెంబర్ బిల్లు. తెలంగాణకు ఆర్థిక సాయంపై ప్రైవేట్ మెంబర్ బిల్లు
- నేటి నుంచి ఐదు రోజులపాటు సెలవుపై వెళ్లనున్న తెలంగాణ సీఎస్ రాజీవ్ శర్మ. ఇంఛార్జ్ సీఎస్‌గా ప్రదీప్‌చంద్రకు బాధ్యతలు అప్పగించిన ప్రభుత్వం
- మొబైల్ కంపెనీ ప్రతినిధులు, బ్యాంకర్లతో భేటీకానున్న ఏపీ సీఎం చంద్రబాబు
- గాంధీ ఆస్పత్రిలో హర్సే వాహనాలు ప్రారంభించనున్న మంత్రి లక్ష్మారెడ్డి. నేటి నుంచి అన్ని జిల్లాల్లోనూ వాహనాలును ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రభుత్వం
- వికారాబాద్ జిల్లాలో పర్యటించనున్న తెలంగాణ మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, మహేందర్ రెడ్డి
- నేటి నుంచి రష్యాలో గ్రాండ్ ప్రి చెస్ టోర్నీ ప్రారంభం
- నేడు పునర్వసు నక్షత్రం. భద్రాచలంలో సీతారాములకు భక్తుల కోటి దీపోత్సవం. నేడు ఒంటిమిట్టలో కళ్యాణోత్సవం
- చిత్తూరు జిల్లా తిరుమల శ్రీవారి ఆలయానికి రోజురోజుకు తగ్గిపోతున్న భక్తుల తాకిడి
టుడే అప్‌డేట్స్
Published Fri, Nov 18 2016 7:12 AM | Last Updated on Mon, Sep 4 2017 8:27 PM
Advertisement
Advertisement