ఉపాధ్యాయులు వివరణ ఇవ్వాలి | give explanation who did not attend without permission | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయులు వివరణ ఇవ్వాలి

Published Thu, Sep 29 2016 1:18 AM | Last Updated on Mon, Sep 4 2017 3:24 PM

give explanation who did not attend without permission

నల్లగొండ టూటౌన్‌: జిల్లా విద్యాశాఖకు ఎలాంటి సమాచారం తెలపకుండా పాఠశాలల విధులకు  గైర్హాజరవుతున్న ఉపాధ్యాయులు వారం రోజులలోగా వివరణ ఇవ్వాలని డీఈఓ వై.చంద్రమోహన్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అనుమతి లేకుండా దేవరకొండలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు ఎస్‌.విమల 2011 నుంచి, మునగాల మండలం నెలమర్రీ జెడ్పీహెచ్‌ఎస్‌ ఉపాధ్యాయులు పి.సౌజన్య 2005 నుంచి, నల్లగొండలోని ఆర్‌పీ రోడ్డు ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు సబియా జబీన్‌ 2013 నుంచి, వలిగొండ మండలం దాసిరెడ్డిగూడెం ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలు కె.శ్రీదేవి 2013 నుంచి విధులకు హాజరుకావడం లేదని పేర్కొన్నారు. వారం రోజుల్లోగా ఏలాంటి వివరణ ఇవ్వకుంటే తదుపరి క్రమశిక్షణ చర్యలు తీసుకోబడునని తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement