ఇజ్రాయెల్ ఎగ్జిబిషన్ కు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు | TRS leaders will be attend to israel agricultural exhibition | Sakshi
Sakshi News home page

ఇజ్రాయెల్ ఎగ్జిబిషన్ కు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

Published Mon, Apr 20 2015 6:32 PM | Last Updated on Sun, Sep 3 2017 12:35 AM

ఇజ్రాయెల్ లో జరగనున్న వ్యవసాయ ఎగ్జిబిషన్ కు 8మంది తెలంగాణ ప్రతినిధుల బృందం హాజరుకానుంది.

హైదరాబాద్ : ఇజ్రాయెల్ లో జరగనున్న వ్యవసాయ ఎగ్జిబిషన్ కు 8మంది తెలంగాణ ప్రతినిధుల బృందం హాజరుకానుంది. ఈ నెల 27 నుంచి 30 వరకు ఇజ్రాయెల్ లో వ్యవసాయ శాఖ అధికారులు ఈ ఎగ్జిబిషన్ నిర్వహించనున్నారు. ప్రగతి శీల రైతుల వివాదంలో భాగంగా ఎమ్మెల్యేల పేర్లు చేర్చి విదేశీ పర్యటనకు తెలంగాణ సర్కారు సోమవారం ఉత్తర్వులు జారీచేసింది.

నాలుగు రోజుల పాటు జరిగే ఈ ఎగ్జిబిషన్ కు రైతుల కోటాలో హాజరయ్యేందుకు ఎమ్మెల్యేలు ఏనుగు రవీందర్ రెడ్డి, కె.విద్యాసాగర్ రావు, గంగుల కమలాకర్, డి.మనోహర్ రెడ్డిలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement