Ustad Zakir Hussain Attend Friend Shivkumar Sharma Last Rites - Sakshi
Sakshi News home page

‘సెలవు మిత్రమా..’ పాడె మోసి చితి వద్ద ఉండిపోయిన ఉస్తాద్‌ జకీర్‌ హుస్సేన్‌

Published Fri, May 13 2022 7:15 PM | Last Updated on Fri, May 13 2022 8:26 PM

Ustad Zakir Hussain Attend Friend Shivkumar Sharma Last Rites - Sakshi

ముంబై: భారత సంగీత విద్వాంసుడు.. సంతూర్‌ వాయిద్యాకారుడు పండిట్‌ శివకుమార్‌ శర్మ మరణం సంగీత ప్రపంచంలో తీరని విషాదం నింపింది. 84 ఏళ్ల సంతూర్‌ దిగ్గజం మే 10వ తేదీన గుండె పోటుతో కన్నుమూశారు. ఆయన అంత్యక్రియలు ఆ మరుసటి రోజే ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి. 

అయితే అంత్యక్రియల్లో ఓ ప్రముఖుడి ఫొటోలు ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి. ఆయనెవరో కాదు.. తబలా విద్వాంసుడు జకీర్‌ హుస్సేన్‌(71). శివకుమార్‌ శర్మ, జకీర్‌ హుస్సేన్‌లు సంయుక్తంగా ఎన్నో ప్రదర్శనలు నిర్వహించారు. వయసులో తేడాలున్నా.. ఇద్దరూ మంచి మిత్రులు కూడా. ఈ క్రమంలో తన ప్రాణ స్నేహితుడి అంత్యక్రియలు జకీర్‌ హుస్సేన్‌ హజరయ్యారు. 

అంతేకాదు.. శివకుమార్‌ పాడె మోసిన జకీర్‌ హుస్సేన్‌.. అంత్యక్రియల సమయంలోనూ ఒంటరిగా కాసేపు చితి వద్దే ఉండిపోవడం కెమెరాల దృష్టిని ఆకర్షించింది. ఈ అంత్యక్రియలు ప్రముఖులెవరూ హాజరుకాకపోయినా.. సోషల్‌ మీడియా ద్వారా తమ నివాళులు అర్పించారు.

 

చదవండి: ‘సంతూర్‌' శివకుమార్‌ శర్మ కన్నుమూత.. నేపథ్యం ఏంటంటే..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement