‘శివకేశవ్’ చూసి శ్రీహరి చాలా ఆనందపడ్డారు | 'Sivakesav' double platinum disk | Sakshi
Sakshi News home page

‘శివకేశవ్’ చూసి శ్రీహరి చాలా ఆనందపడ్డారు

Published Tue, Oct 22 2013 1:31 AM | Last Updated on Fri, Sep 1 2017 11:50 PM

‘శివకేశవ్’ చూసి శ్రీహరి చాలా ఆనందపడ్డారు

‘శివకేశవ్’ చూసి శ్రీహరి చాలా ఆనందపడ్డారు

‘‘శ్రీహరి లేని లోటు తీర్చలేనిది. ఆయన చేతుల మీదగా జరగాల్సిన వేడుక ఇది. అలాంటిది ఆయనకు శ్రద్ధాంజలి ఘటించాల్సి రావడం చాలా బాధగా ఉంది’’ అన్నారు బానూరు నాగరాజు (జడ్చర్ల). ఆర్వీ సుబ్రహ్మణ్యం దర్శకత్వంలో శ్రీహరి, జయంత్, గుర్లిన్‌చోప్రా, సంజన కాంబినేషన్‌లో నాగరాజు నిర్మించిన చిత్రం ‘శివకేశవ్’. సోమవారం హైదరాబాద్‌లో ఈ చిత్రం డబుల్ ప్లాటినమ్ డిస్క్ వేడుక జరిగింది. 
 
 ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ -‘‘శ్రీహరి నటించిన పోలీస్, సాంబ, భద్రాచలం తదితర చిత్రాల కోవలో ఈ చిత్రం నిలుస్తుంది. ఈ చిత్రం ఫస్ట్ కాపీ చూసి, ఆయన చాలా ఆనందపడ్డారు. అలాంటి శ్రీహరి హఠాన్మరణం కలచివేస్తోంది. ఆయన సహకారం మరవలేనిది. త్వరలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని చెప్పారు. 
 
 శ్రీహరి కాంబినేషన్‌లో నటించడం మంచి లెర్నింగ్ ఎక్స్‌పీరియన్స్ అయ్యిందని జయంత్ తెలిపారు. ఈ వేడుకలో కృష్ణభగవాన్, విజయ్‌కుమార్, వేణు-పాల్, చిన్నం పాండు,  సంధ్యాజనక్, మధుమణి తదితర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. సముద్ర యూనిట్ సభ్యులకు డబుల్ ప్లాటినమ్ డిస్క్‌లను ప్రదానం చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement