‘శివ కేశవ’ సిద్ధమవుతున్నారు
‘శివ కేశవ’ సిద్ధమవుతున్నారు
Published Sun, Aug 11 2013 12:06 AM | Last Updated on Fri, Sep 1 2017 9:46 PM
శ్రీహరి, జయంత్, గుర్లిన్‌చోప్రా, సంజన, శ్వేతాబసుప్రసాద్, ఖుషీశర్మ ముఖ్య తారలుగా రూపొందుతోన్న చిత్రం ‘శివకేశవ’. ఆర్.వి.సుబ్రమణ్యం దర్శకుడు. నాగరాజు బానూరి (జడ్చర్ల) నిర్మాత. తన పుట్టినరోజు సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ -‘‘యువతరం మెచ్చే యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇది.
శ్రీహరి పాత్ర ఈ చిత్రానికి హైలైట్. భానుచందర్ తనయుడు జయంత్‌కు మంచి బ్రేక్ అవుతుందీ సినిమా. శ్రీవసంత్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలకు మంచి స్పందన లభిస్తోంది.
త్వరలో ప్లాటినమ్ డిస్క్ ఫంక్షన్ జరుపనున్నాం. ఆ తర్వాత సినిమాను విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: ఎ.విజయ్‌కుమార్, నిర్మాణం: సీతారామ ఫిలింస్.
Advertisement
Advertisement