జాబిల్లి కోసం ఆకాశమల్లే... | Director Dasarath 'jabilli kosam akasamalle' Movie Website | Sakshi
Sakshi News home page

జాబిల్లి కోసం ఆకాశమల్లే...

Published Wed, Sep 11 2013 1:34 AM | Last Updated on Fri, Sep 1 2017 10:36 PM

జాబిల్లి కోసం  ఆకాశమల్లే...

జాబిల్లి కోసం ఆకాశమల్లే...

శ్రీహరి, అనూప్‌తేజ్, స్మితిక్ ఆచార్య, సిమ్మిదాస్, సుమన్, ఆమని ముఖ్యతారలుగా రూపొందుతోన్న చిత్రం ‘జాబిల్లి కోసం ఆకాశమల్లే’. రాజ్‌నరేంద్ర దర్శకుడు. శ్రీ శివభవాని సినిమా పతాకంపై గుగ్గిళ్ల శివప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం విశేషాలతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వెబ్‌సైట్‌ని ఇటీవల దర్శకుడు దశరథ్ ఆవిష్కరించారు. 
 
ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ -‘‘ప్రేమలోని మాధుర్యాన్ని సరికొత్త కోణంలో ఆవిష్కరించే చిత్రమిది. యువతను ఆకట్టుకునే అంశాలు పుష్కలంగా ఉన్నాయి. శ్రీహరి పాత్ర చిత్రణ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఆయన పాత్రే ఈ సినిమాకు మెయిన్ హైలైట్. చిత్రీకరణ పూర్తయింది. 
 
ప్రస్తుతం  నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నెలాఖరున పాటలను విడుదల చేస్తాం’’ అని తెలిపారు. కృష్ణభగవాన్, జీవా, ఎల్బీ శ్రీరామ్, తాగుబోతు రమేష్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: కాసర్ల శ్యామ్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement