జాబిల్లి కోసం ఆకాశమల్లే | srihari upcoming movie 'jabilli kosam akasamalle' | Sakshi
Sakshi News home page

జాబిల్లి కోసం ఆకాశమల్లే

Published Fri, Aug 16 2013 12:03 AM | Last Updated on Fri, Sep 1 2017 9:51 PM

జాబిల్లి కోసం ఆకాశమల్లే

జాబిల్లి కోసం ఆకాశమల్లే

శ్రీహరి ప్రధాన పాత్రలో రూపొందుతోన్న చిత్రం ‘జాబిల్లి కోసం ఆకాశమల్లే’. రాజ్ నరేంద్ర దర్శకుడు. శ్రీ శివభవాని సినిమా పతాకంపై గుగ్గిళ్ల శివప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 
 
 అనూప్‌తేజ్, స్మితిక ఆచార్య, సిమ్మిదాస్, సుమన్, ఆమని ఇందులో ముఖ్యతారలు. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోన్న ఈ సినిమా గురించి నిర్మాత మాట్లాడుతూ -‘‘ఓ కొత్త ఒరవడిలో సాగే ప్రేమకథ ఇది. ఇందులో శ్రీహరి నటన అద్భుతం. 
 
 ఆయన పాత్రే ఈ సినిమాకు వెన్నెముక. సుమన్, ఆమని పాత్రలు కూడా ఆకట్టుకుంటాయి. ఈ నెలాఖరున పాటలను, వచ్చే నెలలో చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: కాసర్ల శ్యామ్, కెమెరా: జీఎల్ బాబు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement