‘జాబిల్లి కోసం ఆకాశమల్లె’ పాటలు
‘‘శ్రీహరి వల్ల ఎంతో మంది దర్శకులూ నిర్మాతలూ అయ్యారు. మరెందరికో ఆయన జీవితాన్నిచ్చారు. ఆయన నటించిన ఈ సినిమా ఫంక్షన్‌లో ఆయనే లేకపోవడం బాధగా ఉంది’’ అని తమ్మారెడ్డి భరద్వాజ్ అన్నారు. శ్రీహరి కీలకపాత్రలో అనూప్‌తేజ్, స్మితిక ఆచార్య, సిమ్మిదాస్ ముఖ్యతారలుగా రాజ్ నరేంద్ర దర్శకత్వంలో గుగ్గిళ్ల శివప్రసాద్ నిర్మించిన ‘జాబిల్లి కోసం ఆకాశమల్లె’ పాటల ఆవిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది. పాటల సీడీని సాగర్ ఆవిష్కరించారు. పాటల రచయిత కాసర్ల శ్యామ్ ఈ చిత్రం ద్వారా సంగీత దర్శకునిగా పరిచయమవుతున్నారు. సినిమా ఆద్యంతం వినోదాత్మకంగా ఉంటుందని అనూప్‌తేజ్ చెప్పారు. ఈ కార్యక్రమంలో శివబాలాజీ, చేతన్, సందీప్‌కిషన్, నిఖిల్, ఖయ్యూమ్ తదితరులు మాట్లాడారు.