స్వచ్ఛమైన ప్రేమకు అచ్చమైన నిర్వచనం | Jabilli Kosam Akasamalle Srihari last movie | Sakshi
Sakshi News home page

స్వచ్ఛమైన ప్రేమకు అచ్చమైన నిర్వచనం

Published Mon, Jun 2 2014 10:48 PM | Last Updated on Sat, Sep 2 2017 8:13 AM

స్వచ్ఛమైన ప్రేమకు అచ్చమైన నిర్వచనం

స్వచ్ఛమైన ప్రేమకు అచ్చమైన నిర్వచనం

 ‘‘ఇప్పటివరకూ తెలుగు తెరపై రాని ప్రేమకథ ఇది. స్వచ్ఛమైన ప్రేమకు అచ్చమైన నిర్వచనంగా నిలుస్తుంది. ప్రతి ఒక్కరూ చూడదగ్గ చిత్రమిది’’ అని దర్శకుడు రాజ్ నరేంద్ర చెప్పారు. అనూప్‌తేజ్, రితికా ఆచార్య, సిమ్మిదాస్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘జాబిల్లి కోసం ఆకాశమల్లే’. ఇందులో  ‘రియల్‌స్టార్’ శ్రీహరి ముఖ్యపాత్ర పోషించారు. శ్రీ శివభవాని సినిమా పతాకంపై గుగ్గిళ్ల శివప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నెల రెండో వారంలో ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ -‘‘శ్రీహరి నటన ఈ సినిమాకు మెయిన్ హైలైట్. ఆయన నటించిన ఆఖరి చిత్రమిది. ఆయన పాత్ర అందరి హృదయాల్లోనూ నిలిచిపోతుంది. ఈ చిత్రాన్ని ఆయనకే అంకితం ఇస్తున్నాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: జీఎల్ బాబు, సమర్పణ: శశిప్రీతమ్, సహనిర్మాతలు: గుగ్గిళ్ల నాగభూషణం, రాము.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement