శ్రీహరికి ఈ సినిమా అంకితం | shiva keshav movie release on 20th june | Sakshi
Sakshi News home page

శ్రీహరికి ఈ సినిమా అంకితం

Published Mon, Jun 16 2014 10:55 PM | Last Updated on Sat, Sep 2 2017 8:54 AM

శ్రీహరికి ఈ సినిమా అంకితం

శ్రీహరికి ఈ సినిమా అంకితం

 ‘‘శ్రీహరి కెరీర్‌లో ‘శివకేశవ్’ ఓ అద్భుతం. ఆయనే బ్రతికి ఉంటే... హీరోగా సెకండ్ ఇన్నింగ్స్‌కి బంగారు బాట వేసేదీ సినిమా. ఆ స్థాయిలో విజృంభించి నటించారు శ్రీహరి’’ అని నిర్మాత బానూరు నాగరాజు(జడ్చర్ల) అన్నారు. స్వర్గీయ శ్రీహరి, భానుచందర్ తనయుడు జయంత్ కథానాయకులుగా రూపొందిన చిత్రం ‘శివకేశవ్’. సంజన, గుర్లిన్‌చోప్రా, శ్వేతాబసు ప్రసాద్ హీరోయిన్లు. ఆర్వీ సుబ్రమణ్యం దర్శకుడు. ఈ సినిమా ఈ నెల 20న విడుదల కానుంది.
 
 ఈ సందర్భంగా సోమవారం నాగరాజు విలేకరులతో ముచ్చటించారు. అనుకున్న దానికంటే సినిమా బాగా వచ్చిందని, గత కొన్నాళ్లుగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల కారణంగా విడుదలకు జాప్యం జరిగిందని నాగరాజు చెప్పారు. జయంత్ నటన ఆకట్టుకుంటుందని, గుర్లిన్ చోప్రా, సంజన, శ్వేతాబసు ప్రసాద్ గ్లామర్ ఈ చిత్రానికి అదనపు ఆకర్షణ అని ఆయన తెలిపారు. శ్రీహరికి ఈ చిత్రాన్ని అంకితమిస్తున్నామని, శ్రీను వైట్ల శిష్యుడు వెంకటేశ్ రెబ్బా దర్శకత్వంలో ‘నాక్కొంచెం టైమ్ కావాలి’ పేరుతో ఓ చిత్రాన్ని నిర్మించనున్నామని నాగరాజు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement