Jayanta
-
విద్యార్థులు మానసిక ఒత్తిడిని జయించాలి: జయంత్ చల్లా
మానసిక స్థైర్యంతో తమకి ఉన్న ఒత్తిడులను తొలగించుకోవాలని ఆటా వేడుకల చైర్, ఎలెక్ట్ ప్రెసిడెంట్ జయంత్ చల్లా విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఆటా వేడుకల్లో భాగంగా 20 రోజుల పాటు నిర్వహించే సేవ కార్యక్రమాల్లో భాగంగా వనపర్తి జిల్లా కేంద్రంలో ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో అల కుటుంబం, ఆటా సెక్రెటరీ రామకృష్ణ రెడ్డి ఆల వారి సహకారంతో ఏర్పాటు చేసిన ఎడ్యుకేషనల్ సెమినార్లో మోటివేషనల్ స్పీకర్, RGUKT, బాసర విసి వి.వెంకటరమణతో కలిసి జయంత్ చల్లా హాజరయ్యారు. ఈ సందర్భంగా జయంత్ చల్లా మాట్లాడుతూ.. విద్యార్థులకు తల్లిదండ్రులు, అధ్యాపకులు, స్నేహితులు అందరితో ఒత్తిడులు, సవాళ్లు వుంటాయని, వాటిని ఎదుర్కొని నిలబడి విద్యార్థి తమ అనుకున్న లక్ష్యానికి చేరుకోవాలని అన్నారు. అలాగే వచ్చే భవిష్యత్ అంతా కూడా... విద్యార్థులదేనని అందుకు అనుగుణంగా కష్టపడాలి అన్నారు. మా ఆటా సేవ లక్ష్యాలలో విద్య కూడా వుందని, విద్యార్థులు ఏ సహాయం కోరినా ఆటా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి తమ ప్రాంత ప్రజలకు అవగాహన కల్పించడానికి ఈ సెమినార్ ను ఏర్పాటు చేసిన ఆటా సెక్రెటరీ రామకృష్ణ రెడ్డి అల ను అభినందించారు. ఇదే సందర్భంలో మోటివేషనల్ స్పీకర్, RGUKT బాసర విసి వెంకటరమణ విద్యార్థులు తమ భవిష్యత్ ప్రణాళికలు ఎలా సిద్దం చేసుకోవాలి, ఇతర దేశాలకి వెళ్లి సెటిల్ కావడం, చదువుకోవడం లాంటివి ఎలా? అనే విషయాన్ని ప్రతి ఒక్కటి విద్యార్థులకు క్షుణ్ణంగా వివరించారు. విద్యార్థులు అడిగిన సందేహాలను నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆటా వేడుకల కో చైర్ వేణు సంకినేని, ఆటా సెక్రెటరీ రామకృష్ణారెడ్డి అల, ఆటా కోశాధికారి సతీష్ రెడ్డి, 18వ ఆటా కాన్ఫరెన్స్ నేషనల్ కో ఆర్డినేటర్ సాయి సుధిని, ఆటా జాయింట్ సెక్రటరీ రవీందర్ గూడూరు, మీడియా కో ఆర్డినేటర్ ఈశ్వర్ బండా, ఆటా బోర్డు ఆఫ్ ట్రస్టీస్ నరసింహారెడ్డి ద్యాసాని, కాశీ కొత్త, కిషోర్ గూడూరు, వనపర్తి పరిధిలో గల 10 కాలేజీల ప్రిన్సిపాల్స్, అధ్యాపక బృందం, 250 మందికి పైగా విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. (చదవండి: అట్టహాసంగా టీటీఏ మొదటి రోజు మెడికల్ క్యాంపు) -
అమలాపురం టు షిర్డీ
సుందరి ట్రావెల్స్ చాలా ఫేమస్. అమలాపురం టు షిర్డీ వెళ్లే ఈ ట్రావెల్స్ బస్సులో విభిన్న మనస్తత్వాలున్న వ్యక్తులు ప్రయాణం చేస్తారు. ఒక్కొక్కరిది ఒక్కో కథ. ఆ కథల సమాహారంతో రూపొందిన చిత్రం ‘మిక్సర్ పొట్లం’. నటుడు భానుచందర్ తనయుడు జయంత్, శ్వేతాబసు ప్రసాద్, గీతాంజలి హీరో హీరోయిన్లు. ఎం.వి. సతీష్ కుమార్ దర్శకత్వంలో కలపటపు లక్ష్మీప్రసాద్, కంటే వీరన్న చౌదరి, లంకపల్లి శ్రీనివాసరావు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 19న విడుదలకానుంది. ఈ సందర్భంగా చెన్నైలో ఏర్పాటు చేసిన ప్రీమియర్ షోను కె.భాగ్యరాజా, భానుచందర్, ఎస్పీబీ, వెన్నెలకంటి తదితరులు వీక్షించారు. ‘‘శ్వేతాబసు నటన హైలెట్. ప్రముఖులందరూ ప్రీమియర్ షో చూసి, అభినందించడం సంతోషం’’ అన్నారు దర్శక–నిర్మాతలు. -
శ్రీహరికి ఈ సినిమా అంకితం
‘‘శ్రీహరి కెరీర్లో ‘శివకేశవ్’ ఓ అద్భుతం. ఆయనే బ్రతికి ఉంటే... హీరోగా సెకండ్ ఇన్నింగ్స్‌కి బంగారు బాట వేసేదీ సినిమా. ఆ స్థాయిలో విజృంభించి నటించారు శ్రీహరి’’ అని నిర్మాత బానూరు నాగరాజు(జడ్చర్ల) అన్నారు. స్వర్గీయ శ్రీహరి, భానుచందర్ తనయుడు జయంత్ కథానాయకులుగా రూపొందిన చిత్రం ‘శివకేశవ్’. సంజన, గుర్లిన్‌చోప్రా, శ్వేతాబసు ప్రసాద్ హీరోయిన్లు. ఆర్వీ సుబ్రమణ్యం దర్శకుడు. ఈ సినిమా ఈ నెల 20న విడుదల కానుంది. ఈ సందర్భంగా సోమవారం నాగరాజు విలేకరులతో ముచ్చటించారు. అనుకున్న దానికంటే సినిమా బాగా వచ్చిందని, గత కొన్నాళ్లుగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల కారణంగా విడుదలకు జాప్యం జరిగిందని నాగరాజు చెప్పారు. జయంత్ నటన ఆకట్టుకుంటుందని, గుర్లిన్ చోప్రా, సంజన, శ్వేతాబసు ప్రసాద్ గ్లామర్ ఈ చిత్రానికి అదనపు ఆకర్షణ అని ఆయన తెలిపారు. శ్రీహరికి ఈ చిత్రాన్ని అంకితమిస్తున్నామని, శ్రీను వైట్ల శిష్యుడు వెంకటేశ్ రెబ్బా దర్శకత్వంలో ‘నాక్కొంచెం టైమ్ కావాలి’ పేరుతో ఓ చిత్రాన్ని నిర్మించనున్నామని నాగరాజు తెలిపారు.