
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ అధికారి(సీపీఆర్వో)గా సీనియర్ జర్నలిస్ట్ పూడి శ్రీహరి నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం సాధారణ పరిపాలన శాఖ శ్రీహరి నియామక ఉత్తర్వులను జారీ చేసింది. శ్రీహరి రెండు దశాబ్దాలుగా మీడియాలో పనిచేశారు. గత రెండేళ్లుగా వైఎస్ జగన్ మీడియా వ్యవహారాలు చూస్తున్నారు. అలాగే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాజకీయ జీవితం, ఆయన చేసిన ప్రజాసంకల్పయాత్ర విశేషాలతో ‘‘అడుగడుగునా అంతరంగం’’ పేరుతో శ్రీహరి పుస్తకాన్ని రాశారు.