cpro
-
‘గవర్నర్‌పై కించపరిచే వార్తలు.. క్షమాపణ చెప్పాలి’
సాక్షి, హైదరాబాద్ : కొత్త గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌పై ముఖ్యమంత్రి సీపీఆర్ఓ విషం కక్కేలా వార్తలు రాయించారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఇంద్రసేనారెడ్డి మండిపడ్డారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగబద్ధమైన గవర్నర్ పదవిని కించపరిచే విధంగా వార్తలు రాయించిన సీపీఆర్ఓను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే క్రిమినల్ కేసు పెడతామని హెచ్చరించారు. ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటూ రాజ్యాంగ బద్ధ పదవిని అవమానించడమేంటని అన్నారు. గవర్నర్ పదవిని రాజకీయంగా వాడుకుంటున్నారని ఆరోపించారు. సోమవారం ఇంద్రసేనారెడ్డి మీడియాతో మాట్లాడుతూ... ‘గవర్నర్ పదవిని కించపరిచే విధంగా వ్యాసం ప్రచురించి.. ఆర్టికల్ చివరన ఇది నా సొంత అభిప్రాయం అని రాయించారు. ఇదంతా ముఖ్యమంత్రి కనుసన్నల్లోనే జరిగింది. గవర్నర్ పదవి పేరును షేక్ అంటూ రాయించడం అవమానించడమే అవుతుంది. గవర్నర్‌గా తమిళిసై ప్రమాణం చేసి 24 గంటలు గడవకముందే ఈ విధమైన వ్యాసాలు రాయించారు. ఇక సర్కారియా కమిషన్‌పై ఆర్టికల్ రాసిన వ్యక్తికి కనీస అవగాహన లేదు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డ వ్యక్తులకు మంత్రి పదవులు ఇచ్చినపుడు ఎవరితో ప్రమాణ స్వీకారం చేయించావు. గవర్నర్‌తోనే కదా. గవర్నర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వార్తలు వెలువడినందుకు క్షమాపణలు చెప్పాలి. పార్లమెంటు ఎన్నికల తరువాత బీజేపీకి ప్రజల్లో మద్దతు మరింత పెరిగింది. టీఆర్ఎస్పైన కార్యకర్తలకు నమ్మకం పోయింది. చాలా సందర్భంగా టీఆర్ఎస్లో అసమ్మతి బయటపడుతోంది. ఈటల, రసమయి, నాయిని, జోగురామన్న ఇలా ఒకరి తరువాత మరొకరు బయటపడుతున్నారు. -
సీఎం వైఎస్ జగన్ సీపీఆర్వోగా పూడి శ్రీహరి
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ అధికారి(సీపీఆర్వో)గా సీనియర్ జర్నలిస్ట్ పూడి శ్రీహరి నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం సాధారణ పరిపాలన శాఖ శ్రీహరి నియామక ఉత్తర్వులను జారీ చేసింది. శ్రీహరి రెండు దశాబ్దాలుగా మీడియాలో పనిచేశారు. గత రెండేళ్లుగా వైఎస్ జగన్ మీడియా వ్యవహారాలు చూస్తున్నారు. అలాగే వైఎస్ జగన్మోహన్రెడ్డి రాజకీయ జీవితం, ఆయన చేసిన ప్రజాసంకల్పయాత్ర విశేషాలతో ‘‘అడుగడుగునా అంతరంగం’’ పేరుతో శ్రీహరి పుస్తకాన్ని రాశారు. -
పలు పరీక్షల కోసం ప్రత్యేక రైళ్లు
సాక్షి, హైదరాబాద్: లోకోపైలట్, టెక్నికల్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల కోసం వివిధ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. సికింద్రాబాద్ నుంచి దానాపూర్‌కు 03242 నంబర్ గల సికింద్రాబాద్–దానాపూర్ ప్రత్యేక రైలు ఆగస్టు 9న సికింద్రాబాద్ నుంచి రాత్రి 8 గంటలకు బయల్దేరి ఆగస్టు 11 ఉదయం 7.40కి దానాపూర్ చేరుకుంటుందని ద.మ.రైల్వే సీపీఆర్వో ఉమేశ్‌కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. ముజఫరాబాద్, సికింద్రాబాద్ మధ్య.. 05289 నంబర్ గల ముజఫరాబాద్–సికింద్రాబాద్ స్పెషల్ ట్రెయిన్ ముజఫరాబాద్ నుంచి ఆగస్టు 8న మధ్యాహ్నం 12కి బయల్దేరి శుక్రవారం తెల్లవారుజామున ఒంటి గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. అలాగే 05290 నంబర్ గల స్పెషల్ ట్రెయిన్ ఆగస్టు 10న రాత్రి 9కి సికింద్రాబాద్ నుంచి బయల్దేరి, ఆదివారం మధ్యాహ్నం 2.00 గంటలకు ముజఫరాబాద్ చేరుకుంటుంది.. చెన్నై సెంట్రల్ నుంచి అహ్మదాబాద్‌కు.. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని చెన్నై సెంట్రల్ నుంచి అహ్మదాబాద్‌కు 16 ప్రత్యేక రైళ్లు నడపనున్నారు. 06051 నంబర్ చెన్నై సెంట్రల్–అహ్మదాబాద్ వీక్లీ స్పెషల్ ఫేర్ ట్రెయిన్లు చెన్నై సెంట్రల్ నుంచి ఆగస్టు 11, 18, 25, సెప్టెంబరు 1, 8, 15, 22, 29 తేదీల్లో (శనివారాలు) రాత్రి 8.10 నుంచి బయల్దేరి ఉదయం 5.45 గంటలకు (సోమవారాలు) అహ్మదాబాద్ చేరతాయి. 06052 నంబర్ అహ్మదాబాద్ నుంచి చెన్నై సెంట్రల్ వీక్లీ వీక్లీ స్పెషల్ ఫేర్ ట్రెయిన్లు అహ్మదాబాద్ నుంచి ఈనెల 13, 20, 27, సెప్టెంబరు 3, 10, 17, 24, అక్టోబరు 1 (సోమవారాలు)న ఉదయం 9.40 నిమిషాలకు బయల్దేరి (మంగళవారాలు) సాయంత్రం 5.10కి చెన్నై సెంట్రల్ చేరుకుంటాయి. -
పేపర్ల లీకేజి వెనుక మశ్చేందర్?
ఆర్ఆర్బీ గ్రూప్-డి పరీక్ష పత్రాల లీకేజి వ్యవహారం వెనక మశ్చేందర్ అనే రైల్వే ఉద్యోగి పాత్ర ఉన్నట్లు తెలుస్తోందని దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సాంబశివరావు తెలిపారు. లీకేజి ఘటన దురదృష్టకరమని ఆయన అన్నారు. రైల్వే సిబ్బంది పాత్ర ఉంటే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని చెప్పారు. మిగిలిన సెంటర్లలో పరీక్షలు ప్రశాంతంగా సాగాయని ఆయన అన్నారు. కాపీయింగ్ చేస్తున్నారన్న ఆరోపణలపై పదిమందిని పోలీసులు విచారిస్తున్నారని సాంబశివరావు అన్నారు. పరీక్ష రద్దు అనే ప్రశ్న ఇప్పుడు తలెత్తదని ఆయన చెప్పారు. పోలీసులు అందించిన వివరాలను రైల్వే బోర్డుకు నివేదిస్తామని, రైల్వే బోర్డు ఆదేశాల మేరకు నడుకుంటామని అన్నారు. మొత్తం 3.19 లక్షల మంది ఈ పరీక్షలు రాసినట్లు సాంబశివరావు చెప్పారు.