![Manda Krishna Comment on Kadiam Srihari - Sakshi](/styles/webp/s3/article_images/2023/08/29/mandhani%20krishana.jpg.webp?itok=8d_2RlDY)
స్టేషన్‌ఘన్‌పూర్: ఎమ్మెల్సీ కడియం శ్రీహరి గుంటనక్కలాంటి వాడని, ఆనాడు డాక్టర్ రాజయ్య డిప్యూటీ సీఎం బర్తరఫ్‌లో, ప్రస్తుతం బీఆర్‌ఎస్ టికెట్ రాకపోవడంలో కడియం కుట్ర ఉందని, రెండు సందర్భాల్లో కడియం సూత్రధారుడని ఎమ్మార్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లో సోమవారం జరిగిన నియోజకవర్గస్థాయి మాదిగల అస్థిత్వం, ఆత్మగౌరవసభలో ఆయన మాట్లాడారు.
సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో మాదిగల అస్థిత్వం దెబ్బతినే ప్రమాదం ఉందని, కాపాడుకోవాల్సిన బాధ్యత మాదిగలందరిపై ఉందన్నారు. డిప్యూటీ సీఎం హోదాలో రాజయ్య పంచె, ధోతి కట్టుకుని రాష్ట్రమంతా తిరిగితే పెద్దదొర కేసీఆర్, దళితదొర కడియం ఓర్వలేదన్నారు. కడియం మాదిగలను అణగదొక్కేలా గుంటనక్కలా వ్యవహరిస్తున్నారన్నారు.
లైంగిక వేధింపుల విషయమై రాజయ్యపై నిరాధారమైన ఆరోపణలతో మహిళా కమిషన్ సుమోటో కేసు ఎలా స్వీకరించిందని మంద కృష్ణ ప్రశ్నించారు. భూపాలపల్లి, బెల్లంపల్లి, ఆర్మూరు ఎమ్మెల్యేలపై లైంగిక వేధింపులపై చర్యలు ఎందుకు తీసుకోలేదన్నారు. కేవలం రాజయ్య మాదిగ ఎమ్మెల్యే కావడంతోనే సుమోటోగా స్వీకరించారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment