krishna madiga
-
కడియం శ్రీహరి గుంటనక్క లాంటివాడు
స్టేషన్‌ఘన్‌పూర్: ఎమ్మెల్సీ కడియం శ్రీహరి గుంటనక్కలాంటి వాడని, ఆనాడు డాక్టర్ రాజయ్య డిప్యూటీ సీఎం బర్తరఫ్‌లో, ప్రస్తుతం బీఆర్ఎస్ టికెట్ రాకపోవడంలో కడియం కుట్ర ఉందని, రెండు సందర్భాల్లో కడియం సూత్రధారుడని ఎమ్మార్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లో సోమవారం జరిగిన నియోజకవర్గస్థాయి మాదిగల అస్థిత్వం, ఆత్మగౌరవసభలో ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో మాదిగల అస్థిత్వం దెబ్బతినే ప్రమాదం ఉందని, కాపాడుకోవాల్సిన బాధ్యత మాదిగలందరిపై ఉందన్నారు. డిప్యూటీ సీఎం హోదాలో రాజయ్య పంచె, ధోతి కట్టుకుని రాష్ట్రమంతా తిరిగితే పెద్దదొర కేసీఆర్, దళితదొర కడియం ఓర్వలేదన్నారు. కడియం మాదిగలను అణగదొక్కేలా గుంటనక్కలా వ్యవహరిస్తున్నారన్నారు. లైంగిక వేధింపుల విషయమై రాజయ్యపై నిరాధారమైన ఆరోపణలతో మహిళా కమిషన్ సుమోటో కేసు ఎలా స్వీకరించిందని మంద కృష్ణ ప్రశ్నించారు. భూపాలపల్లి, బెల్లంపల్లి, ఆర్మూరు ఎమ్మెల్యేలపై లైంగిక వేధింపులపై చర్యలు ఎందుకు తీసుకోలేదన్నారు. కేవలం రాజయ్య మాదిగ ఎమ్మెల్యే కావడంతోనే సుమోటోగా స్వీకరించారన్నారు. -
రేపు సోనియాను కలవనున్న మంద కృష్ణ
సాక్షి,రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: మాదిగ సామాజిక వర్గానికి అసెంబ్లీ సీట్ల కేటాయింపులో రాజకీయ పార్టీలు వివక్ష చూపిస్తున్నాయని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్టమాదిగ ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత ఎ.చంద్రశేఖర్‌తో మంద కృష్ణ గురువారం భేటీ అయ్యారు. చంద్రశేఖర్ వికారాబాద్ టికెట్ ఆశిస్తున్న వ్యవహారంపై ఇరువురు చర్చించారు. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ మాదిగలను చిన్నచూపు చూసిందన్నారు. రాష్ట్రం లో ఎస్సీలకు రిజర్వ్ చేసిన 18 స్థానాల్లో మాదిగ సామాజిక వర్గానికి తీవ్ర నిరాశే ఎదురైందన్నారు. ఇదే విషయాన్ని ఆయన కాంగ్రెస్ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలని భావిస్తున్నారు. అం దులో భాగంగా ఆయన శనివారం ఢిల్లీ వెళ్లి కాం గ్రెస్ అధినాయకురాలు సోనియాగాంధీని కలవాలని నిర్ణయించారు. ఈ మేరకు కాంగ్రెస్ ఎస్సీ సెల్ జాతీయ నాయకురాలు మీరాకుమార్ నేతృత్వంలో ఢిల్లీబాట పట్టనున్నారు. ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో అధిక శాతం మాదిగ జనాభా ఉన్నారని, ఆ స్థానాలను వారికే కేటాయించాల న్న విషయాన్ని ప్రస్తావించనున్నట్లు తెలుస్తోంది. -
అప్పుడు కేసీఆర్‌ను అరెస్ట్ చేసి ఉంటే...
హైదరాబాద్: ఆనాడు మిలియన్ మార్చ్ సందర్భంగా అప్పటి ప్రభుత్వం కేసీఆర్‌ను అరెస్ట్ చేసి ఉంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదా.. సీఎంగా కేసీఆర్ అధికారం చెలాయించేవాడా... అని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ ప్రశ్నించారు. ఎమ్మార్పీఎస్ మెరుపు ముట్టడి నేప థ్యంలో పోలీసులు ఆదివారం అర్ధరాత్రి సికింద్రాబాద్‌లో కృష్ణ మాదిగను అరెస్ట్ చేసి దక్షిణ మండలంలోని కామాటిపురా పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఆయనతోపాటు మరో ఐదుగురిపై రాంగోపాల్‌పేట్ పోలీస్‌స్టేషన్‌లో పలు కేసులు నమోదు చేశారు. అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించారని, ట్రాఫిక్‌కు అంతరా యం కలిగించారని కార్ఖానా పోలీసుస్టేషన్లో కూడా కృష్ణ మాదిగపై కేసులు నమోదు చేశారు. ఆయనతోపాటు ఎమ్మార్పీఎస్ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు రాగాటి సత్యం మాదిగ, మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు లత మాధవిని సోమవారం సాయంత్రం వరకు కామాటిపురా పోలీస్‌స్టేషన్‌లో నిర్బంధించారు. అనంతరం వారితోపాటు మరో 9 మందిని సికింద్రాబాద్‌లోని 9వ మెట్రోపాలి టన్ మేజిస్ట్రేట్ శ్రీలత ఇంటికి తరలించి ఆమె ముందు హాజరుపర్చారు. వారికి మేజిస్ట్రేట్ 14 రోజుల వరకు రిమాండ్ విధించారు. మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు నిందితులను చంచల్‌గూడ జైలు కు తరలించారు. అంతకుముందు కామాటిపురా పోలీస్‌స్టేషన్ వద్ద కృష్ణ మాదిగ విలేకరులతో మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడుతున్న తమపై రాష్ట్ర ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయడం దారుణ మన్నారు. రాత్రంతా పోలీస్‌స్టేషన్‌లో బంధించడం అప్రజాస్వామికమన్నారు. పోలీసుస్టేషన్ వద్ద ఉద్రిక్తత సోమవారం ఉదయం ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలు, న్యాయవాదులు పెద్ద ఎత్తున కామాటిపుర పోలీస్‌స్టేషన్‌కు తరలిరావడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.టిఫిన్‌తోపాటు రోజువారీగా కృష్ణ మాదిగకు మందులు ఇవ్వాల్సిన అవసరముందని చెప్పినా పోలీసులు అనుమతించలేదు. కృష్ణ మాదిగను కలుస్తామని కార్యకర్తలు పట్టుబట్టడంతో ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల చర్యను నిరసిస్తూ నగరంలోని పలుచొట్ల సీఎం దిష్టిబొమ్మలను దహనం చేశారు. -
ఆఖరి మెట్టుపై ఉన్నాం గెలుపు మనదే
–మాలల రూపంలో స్వార్ద శక్తులు పొంచిఉన్నాయి –ఎస్సీ వర్గీకరణ సాధిద్దాం –మాదిగల ధర్మయుద్ద సన్నాహక సభలో మంద కృష్ణమాదిగ –సంఘీభావం ప్రకటించిన దేవాదాయశాఖా మంత్రి పైడికొండల –జిల్లా వ్యాప్తంగా తరలివచ్చిన మాదిగలు తాడేపల్లి గూడెం: ఎస్సీ వర్గీకరణ పోరాటం కీలక దశకు చేరుకుంది. పోరాటంలో మలుపులు. అవరోధాలు అధిగమిస్తూ విజయంలోని వెయ్యి మెట్లలో 999వ మెట్టుకు చేరుకున్నాం. దళితుల్లో అభివృద్ది రూపంలో ముందడుగు వేసిన వారే ప్రతిబంధకాలు సష్టించారు. ఉద్యమంలో ఎదిగిన వారు పాలకవర్గాల కొమ్ముకాసి ఉద్యమాన్ని దెబ్బతీశారు. లక్ష్యానికి చేరువగా ఉన్నాం. మూడు సార్లు వర్గీకరణ ఫలాలు అందినట్టే అంది. చేజారి పోడానికి కారకులైన స్వార్ధపరులైన మాలలు అవకాశాలను దెబ్బతీయడానికి పొంచి ఉంటారు అయ్యినా విజయం మనదే అని ఎంఆర్పీఎస్ వ్యవస్ధాపక అధ్యక్షులు కృష్ణమాదిగ భరోసా ఇచ్చారు. మంగళవారం సాయంత్రం స్దానిక గమిని ఫంక్షన్ ప్లాజా వద్ద జరిగిన మాదిగల ధర్మయుద్ద సన్నాహక జిల్లా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఢిల్లీలో ఇటీవల చేపట్టిన దీక్షల తర్వాత విజయం లో 999వ మెట్టుకు చేరుకున్నామన్నారు. దీక్షలకు ప్రతిపక్షాలు ,వామపక్షాలు మద్దతు పలకడం మామూలే. కేంద్రంలో అధికార పక్షానికి చెందిన వెంకయ్య నాయుడు, దత్తాత్రేయలు దీక్షలకు మద్దతు ప్రకటించారు. అందుకే వర్గీకరణ సాధిస్తామనే నమ్మకం వచ్చిందని కృష్ణమాదిగ అన్నారు. ఎంఆర్పీఎస్ వైపు న్యాయం ఉందని వెంకయ్య అన్నారు. జీఎస్టీ బిల్లు ఆమోదింపచేయడానికి ఎలాంటి కసరత్తు చేశామో అదే కసరత్తు ఎస్సీ వర్గీకరణ బిల్లు విషయంలో చేస్తామని వెంకయ్య చెప్పారన్నారు. మాలల రూపంలో శత్రువు పొంచి ఉన్నాడు మాదిగలు అప్రమత్తంగా ఉండాలన్నారు. సైనికుని కునుకుపాడు ఉడీ లాంటి సంఘటనకు కారణమైందో .ప్రస్తుతం మాదిగలు అప్రమత్తంగా లేకుంటే ప్రమాదం వస్తుందని గమనించాలన్నారు. యుద్ధం నుంచి పారిపోతే జాతికి విముక్తి ఉండదన్నారు. సమాజం మద్దతు ఉంది. రాజకీయ పార్టీల మద్దతు ఉంది. అయ్యినా సాధించిన విజయాలను పలుకుబడితో లాక్కున్నవారు ఉన్నారు. అయ్యినా రాజ్యాంగ సవరణ ద్వారా వచ్చే వచ్చే విజయాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరన్నారు. 1997 లో వర్గీకరణ సాధించాం. మాల కులానికి చెందిన హనుమంతప్ప ఎస్సీఎస్టీ చైర్మన్‌గా ఉండటంతో ఫలాలు అందకుండా పోయాయన్నారు. 1999 నవంబరులో రాష్ట్రపతి ఆమోదంతో వర్గీకరణ తెచ్చుకున్నాం. 2000 నుంచి 2004 వరకు వర్గీకరణ చట్టం అమలు జరిగింది. స్వార్ధపర మాలల వర్గం కన్నేసింది. సుప్రీంకోర్టు లో న్యాయమూర్తి గా అదే కులానికి చెందిన రామస్వామి అనే వ్యక్తి ద్వారా సుప్రీంకోర్టు ద్వారా వర్గీకరణ చెల్లదని తీర్పు ఇచ్చింది. వందకు పైగా కులాలున్న బీసీలకు వర్గీకరణ ఉండాలని తీర్పు నిచ్చిన సుప్రీంకోర్టు, 50 కులాలు కలిగిన ఎస్సీ వర్గీకరణ కుదరదని తీర్పు ఇవ్వకుండా సుప్రీంకోర్టులో ఉన్న మాలలు అడ్డుకున్నారని మంద ఆరోపించారు. యుపీఏ ప్రభుత్వ హయాంలో ఉషా మెహ్రా కమిటీ ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పునిచ్చిందని . దీనికనుగుణంగా అన్ని పార్టీలు లేఖలు ఇచ్చినా, సోనియా గాంధీ, మన్మోçßæన్సింగ్, రాహుల్ గాంధీలకు కార్యదర్శులుగా ఉన్న మాలలు వర్గీకరణ జరుగకుండా చక్రం తిప్పారని కష్ణ మాదిగ అన్నారు. వర్గీకరణ జరుగకుండా చీకట్లో ఓడించే కుట్రలు పార్లమెంటు లో జరిగే అవకాశాలున్నాయన్నారు. పార్లమెంటులో ప్రతిపక్షనేతగా కర్ణాటకకు చెంది , మాల సామాజిక వర్గానికి చెందిన మల్లికార్జున్ ఖర్గే రూపంలో ప్రమాదం పొంచి ఉందని గమనించాలన్నారు. దేశవ్యాప్తంగా వర్గీకరణ కోరుకొనే శక్తులను దేశవ్యాప్తంగా కూడకడుతున్నాం. ఏ ప్రమాదం వచ్చినా అడ్డుకోడానికే ధర్మయుద్ద మహాసభ అన్నారు. మీరిచ్చిన నైతిక సై ్ధర్యంతో ముందుకెళుతున్నాం. యుద్దంలో గెలవనంతకాల చీకట్లో ఉంటాం. వెలుగుకోసం ధర్మయుద్దంలో అంతిమగెలుపుకోసం నవంబరు సభను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. -
ఆఖరి మెట్టుపై ఉన్నాం గెలుపు మనదే
–మాలల రూపంలో స్వార్ద శక్తులు పొంచిఉన్నాయి –ఎస్సీ వర్గీకరణ సాధిద్దాం –మాదిగల ధర్మయుద్ద సన్నాహక సభలో మంద కృష్ణమాదిగ –సంఘీభావం ప్రకటించిన దేవాదాయశాఖా మంత్రి పైడికొండల –జిల్లా వ్యాప్తంగా తరలివచ్చిన మాదిగలు తాడేపల్లి గూడెం: ఎస్సీ వర్గీకరణ పోరాటం కీలక దశకు చేరుకుంది. పోరాటంలో మలుపులు. అవరోధాలు అధిగమిస్తూ విజయంలోని వెయ్యి మెట్లలో 999వ మెట్టుకు చేరుకున్నాం. దళితుల్లో అభివృద్ది రూపంలో ముందడుగు వేసిన వారే ప్రతిబంధకాలు సష్టించారు. ఉద్యమంలో ఎదిగిన వారు పాలకవర్గాల కొమ్ముకాసి ఉద్యమాన్ని దెబ్బతీశారు. లక్ష్యానికి చేరువగా ఉన్నాం. మూడు సార్లు వర్గీకరణ ఫలాలు అందినట్టే అంది. చేజారి పోడానికి కారకులైన స్వార్ధపరులైన మాలలు అవకాశాలను దెబ్బతీయడానికి పొంచి ఉంటారు అయ్యినా విజయం మనదే అని ఎంఆర్పీఎస్ వ్యవస్ధాపక అధ్యక్షులు కృష్ణమాదిగ భరోసా ఇచ్చారు. మంగళవారం సాయంత్రం స్దానిక గమిని ఫంక్షన్ ప్లాజా వద్ద జరిగిన మాదిగల ధర్మయుద్ద సన్నాహక జిల్లా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఢిల్లీలో ఇటీవల చేపట్టిన దీక్షల తర్వాత విజయం లో 999వ మెట్టుకు చేరుకున్నామన్నారు. దీక్షలకు ప్రతిపక్షాలు ,వామపక్షాలు మద్దతు పలకడం మామూలే. కేంద్రంలో అధికార పక్షానికి చెందిన వెంకయ్య నాయుడు, దత్తాత్రేయలు దీక్షలకు మద్దతు ప్రకటించారు. అందుకే వర్గీకరణ సాధిస్తామనే నమ్మకం వచ్చిందని కృష్ణమాదిగ అన్నారు. ఎంఆర్పీఎస్ వైపు న్యాయం ఉందని వెంకయ్య అన్నారు. జీఎస్టీ బిల్లు ఆమోదింపచేయడానికి ఎలాంటి కసరత్తు చేశామో అదే కసరత్తు ఎస్సీ వర్గీకరణ బిల్లు విషయంలో చేస్తామని వెంకయ్య చెప్పారన్నారు. మాలల రూపంలో శత్రువు పొంచి ఉన్నాడు మాదిగలు అప్రమత్తంగా ఉండాలన్నారు. సైనికుని కునుకుపాడు ఉడీ లాంటి సంఘటనకు కారణమైందో .ప్రస్తుతం మాదిగలు అప్రమత్తంగా లేకుంటే ప్రమాదం వస్తుందని గమనించాలన్నారు. యుద్ధం నుంచి పారిపోతే జాతికి విముక్తి ఉండదన్నారు. సమాజం మద్దతు ఉంది. రాజకీయ పార్టీల మద్దతు ఉంది. అయ్యినా సాధించిన విజయాలను పలుకుబడితో లాక్కున్నవారు ఉన్నారు. అయ్యినా రాజ్యాంగ సవరణ ద్వారా వచ్చే వచ్చే విజయాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరన్నారు. 1997 లో వర్గీకరణ సాధించాం. మాల కులానికి చెందిన హనుమంతప్ప ఎస్సీఎస్టీ చైర్మన్‌గా ఉండటంతో ఫలాలు అందకుండా పోయాయన్నారు. 1999 నవంబరులో రాష్ట్రపతి ఆమోదంతో వర్గీకరణ తెచ్చుకున్నాం. 2000 నుంచి 2004 వరకు వర్గీకరణ చట్టం అమలు జరిగింది. స్వార్ధపర మాలల వర్గం కన్నేసింది. సుప్రీంకోర్టు లో న్యాయమూర్తి గా అదే కులానికి చెందిన రామస్వామి అనే వ్యక్తి ద్వారా సుప్రీంకోర్టు ద్వారా వర్గీకరణ చెల్లదని తీర్పు ఇచ్చింది. వందకు పైగా కులాలున్న బీసీలకు వర్గీకరణ ఉండాలని తీర్పు నిచ్చిన సుప్రీంకోర్టు, 50 కులాలు కలిగిన ఎస్సీ వర్గీకరణ కుదరదని తీర్పు ఇవ్వకుండా సుప్రీంకోర్టులో ఉన్న మాలలు అడ్డుకున్నారని మంద ఆరోపించారు. యుపీఏ ప్రభుత్వ హయాంలో ఉషా మెహ్రా కమిటీ ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పునిచ్చిందని . దీనికనుగుణంగా అన్ని పార్టీలు లేఖలు ఇచ్చినా, సోనియా గాంధీ, మన్మోçßæన్సింగ్, రాహుల్ గాంధీలకు కార్యదర్శులుగా ఉన్న మాలలు వర్గీకరణ జరుగకుండా చక్రం తిప్పారని కష్ణ మాదిగ అన్నారు. వర్గీకరణ జరుగకుండా చీకట్లో ఓడించే కుట్రలు పార్లమెంటు లో జరిగే అవకాశాలున్నాయన్నారు. పార్లమెంటులో ప్రతిపక్షనేతగా కర్ణాటకకు చెంది , మాల సామాజిక వర్గానికి చెందిన మల్లికార్జున్ ఖర్గే రూపంలో ప్రమాదం పొంచి ఉందని గమనించాలన్నారు. దేశవ్యాప్తంగా వర్గీకరణ కోరుకొనే శక్తులను దేశవ్యాప్తంగా కూడకడుతున్నాం. ఏ ప్రమాదం వచ్చినా అడ్డుకోడానికే ధర్మయుద్ద మహాసభ అన్నారు. మీరిచ్చిన నైతిక సై ్ధర్యంతో ముందుకెళుతున్నాం. యుద్దంలో గెలవనంతకాల చీకట్లో ఉంటాం. వెలుగుకోసం ధర్మయుద్దంలో అంతిమగెలుపుకోసం నవంబరు సభను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.