సాక్షి,రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: మాదిగ సామాజిక వర్గానికి అసెంబ్లీ సీట్ల కేటాయింపులో రాజకీయ పార్టీలు వివక్ష చూపిస్తున్నాయని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్టమాదిగ ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత ఎ.చంద్రశేఖర్‌తో మంద కృష్ణ గురువారం భేటీ అయ్యారు. చంద్రశేఖర్ వికారాబాద్ టికెట్ ఆశిస్తున్న వ్యవహారంపై ఇరువురు చర్చించారు. ఇప్పటికే టీఆర్‌ఎస్ పార్టీ మాదిగలను చిన్నచూపు చూసిందన్నారు.
రాష్ట్రం లో ఎస్సీలకు రిజర్వ్ చేసిన 18 స్థానాల్లో మాదిగ సామాజిక వర్గానికి తీవ్ర నిరాశే ఎదురైందన్నారు. ఇదే విషయాన్ని ఆయన కాంగ్రెస్ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలని భావిస్తున్నారు. అం దులో భాగంగా ఆయన శనివారం ఢిల్లీ వెళ్లి కాం గ్రెస్ అధినాయకురాలు సోనియాగాంధీని కలవాలని నిర్ణయించారు. ఈ మేరకు కాంగ్రెస్ ఎస్సీ సెల్ జాతీయ నాయకురాలు మీరాకుమార్ నేతృత్వంలో ఢిల్లీబాట పట్టనున్నారు. ఎస్సీ రిజర్వ్‌డ్ నియోజకవర్గాల్లో అధిక శాతం మాదిగ జనాభా ఉన్నారని, ఆ స్థానాలను వారికే కేటాయించాల న్న విషయాన్ని ప్రస్తావించనున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment