గీత స్మరణం | song of the day from movie Bhadrachalam | Sakshi
Sakshi News home page

గీత స్మరణం

Published Thu, Oct 10 2013 1:01 AM | Last Updated on Fri, Sep 1 2017 11:29 PM

గీత స్మరణం

గీత స్మరణం

పల్లవి :


 అతడు: ఇదే నా పల్లెటూరు ఇదే నా తల్లిగారు
 మావూరి పాడిపంట రాములోరి దీవెనంటా
 తల్లీ గోదావరి నీళ్లు కడిగే సీతమ్మ పాదాలు
 ఊరంతా హాయ్ హాయ్ హాయ్...
 మనసంతా హాయ్ హాయ్ హాయ్...    ॥నా పల్లెటూరు॥
 
 చరణం : 1
 
 ఆమె: రామునికి బాణమొకటే భార్య సీతమ్మ ఒకటి
 ఆ రాముడంటి కొడకు ఇంటింటా ఉంటే ఒకడు
 ఊరంతా హాయ్ హాయ్ హాయ్...
 మనసంతా జాయ్ జాయ్ జాయ్...
 అ: ఒక దేవుడే తనకు ఒక ధర్మమే తనది
 హనుమంతుడే మనకు ఆదర్శమే ఐతే
 ఊరంతా హాయ్ హాయ్ హాయ్...
 మనసంతా హాయ్ హాయ్ హాయ్...
 ॥నా పల్లెటూరు॥
 
 చరణం : 2
 
 ఆ: తొలకరిలో వానచుక్క రుచిచూస్తే తేనెచుక్క
 భూమిపై మోముపైన చిన్ని గరిక నవ్వుతుంటే
 ఊరంతా హాయ్ హాయ్ హాయ్...
 మనసంతా జాయ్ జాయ్ జాయ్...
 అ: ఆలమంద పాలధార మీటుతున్నదో సితార
 కడుపునిండా పాలు తాగి లేగదూడలాడుతుంటే
 ఊరంతా హాయ్ హాయ్ హాయ్...
 మనసంతా హాయ్ హాయ్ హాయ్...    ॥నా పల్లెటూరు॥
 
 చిత్రం : భద్రాచలం (2001); రచన : సుద్దాల అశోక్‌తేజ
 సంగీతం : వందేమాతరం శ్రీనివాస్; గానం : వందేమాతరం శ్రీనివాస్, ఉష

 
 నిర్వహణ: నాగేష్

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement