Vandemataram Srinivas
-
కరోనాపై కీరవాణి కదిలించే పాట..
అటు ప్రభుత్వాలకు ఇటు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది కరోనా వైరస్(కోవిడ్-19). ఈ మహమ్మారిపై పోరాటంలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అనేక మంది సెలబ్రెటీలు అండగా నిలుస్తున్నారు. పలువురు ఆర్థిక సహాయం చేస్తుండగా మరికొందరు ఈ వైరస్‌పై ప్రజల్లో అవగాహన తీసుకొచ్చేలా పలు వినూత్న ప్రయత్నాలకు తెరదీస్తున్నారు. ఇప్పటికే కరోనా వైరస్‌పై చౌరస్తా బ్యాండ్, సంగీత దర్శకుడు కోటి అందించిన పాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. తాజాగా టాలీవుడ్ దిగ్గజ సంగీత దర్శకుడు కీరవాణి ‘వి విల్ స్టే ఎట్ హోమ్.. వి స్టే సేఫ్’ అనే పాటను స్వయంగా రాసి, ట్యూన్ చేసి ఆలపించారు. ‘అదిగో పులి అంటే ఇదిగో తోక అని బెదరకండి.. విందులు వినోదాలు కాస్త మానుకోండి.. బతికుంటే బలుసాకు తినగలమని తెలుసుకోండి’, ‘ఇళ్లు ఒళ్లు మనసు శుభ్ర పరుచుకుంటే ఇలలోనే ఆస్వర్గాన్నే చూడొచ్చండి..ఇష్ట దేవతల్ని కాస్త తలచుకుంటే, ఏ కష్టమైనా అవలీలగా దాటొచ్చండి’ అనే లిరిక్స్ ప్రజల్లో చైతన్యంతో పాటు మనోధైర్యాన్ని తీసుకొస్తున్నాయి. కాగా, ఈ పాట కోసం ఆయన గతంలో ‘స్టూడెంట్ నెం. 1’ సినిమాకి కంపోజ్ చేసిన ‘ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి’ పాట ట్యూన్‌నే మళ్లీ తీసుకున్నారు. ఇక గతంలో కూడా కరచాలనం కంటే చేతులెత్తి నమస్కారం చేయడం ఎంత మంచిదో వివరిస్తూ ఓ పద్యాన్ని ఆలపించిన సంగతి తెలిసిందే. చదవండి: కరోనా కట్టడికి బిల్‌గేట్స్ సూచనలు! ‘యుద్ధం లేదు.. కానీ 5 వేల మంది చనిపోతే ఎలా?’ -
రాజశేఖర్ నటవిశ్వరూపం ‘అర్జున’
యాంగ్రీ హీరో రాజశేఖర్, మరియం జకారియా జంటగా నటిస్తున్న చిత్రం ‘అర్జున’. రాజశేఖర్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రానికి కన్మణి దర్శకత్వం వహిస్తున్నారు. నట్టి క్రాంతి, నట్టి కరుణలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. త్వరలోనే విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ముందుగా అనుకున్న ప్రకారం మార్చి 15న విడుదల చేస్తారో లేక ‘అర్జున’ను ఆలస్యంగా విడుదల చేస్తారో వేచి చూడాలి. చిత్ర ప్రమోషన్లో భాగంగా ట్రైలర్‌ను విడుదల చేయడంతో పాటు సినిమా విడుదల తేదీని ప్రకటిస్తామని చిత్ర బృందం ప్రకటించింది. ఇక ఈ చిత్రంలో తండ్రీ కొడుకులుగా రాజశేఖర్ తన పాత్రలలో నట విశ్వరూపం చూపించారని, ప్రస్తుత రాజకీయ నేపథ్య పరిస్థితులకు అద్దంపట్టే చిత్రమని నిర్మాతలు పేర్కొన్నారు. వయసు మళ్లిన సూర్యనారయణ అనే రైతు పాత్ర, ఆయన తనయుడిగా అర్జున్ పాత్రలో రాజశేఖర్ ఒదిగిపోయిన విధానం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుందన్నారు. అంతేకాకుండా తండ్రీ కొడుకుల మధ్య వచ్చే భావోద్వేగ సన్నివేశాలు సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయన్నారు. యదార్థ సంఘటనలను ప్రేరణగా తీసుకుని సహజత్వానికి దగ్గరగా దర్శకుడు కన్మణి ఈ చిత్రాన్ని మలిచారని నిర్మాతలు పేర్కొన్నారు. కోట శ్రీనివాసరావు, చలపతిరావు, రేఖ, మురళీశర్మ, సుప్రీత్, కాదంబరి కిరణ్, శివాజీరాజా తదితరులు నటించిన ఈ చిత్రానికి వందేమాతరం శ్రీనివాస్ సంగీతమందిస్తున్నాడు. -
డల్లాస్‌లో వందేమాతరం శ్రీనివాస్‌కు సత్కారం
డల్లాస్ : ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) ఆధ్వర్యంలో జూన్ 11న దేశీప్లాజాలో ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు వందేమాతరం శ్రీనివాస్‌ను ఘనంగా సత్కరించారు. ఆయనను.. టాంటెక్స్ కార్యదర్శి మహేష్ పార్నపల్లి, ఉత్తరాధ్యక్షులు కృష్ణారెడ్డి కోడూరు, శ్రీకాంత్ రెడ్డిజొన్నల పుష్పగుచ్చంతో వేదిక మీదకు ఆహ్వానించారు. ఆయనతో ముఖాముఖి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. టాంటెక్స్ అధ్యక్షులు వీర్నపు చినసత్యం, కార్యదర్శి మహేష్ పార్నపల్లి, ఉత్తరాధ్యక్షులు కృష్ణారెడ్డి కోడూరు, శ్రీకాంత్ రెడ్డిజొన్నల, పాలకమండలి అధిపతి ఎన్‌ఎమ్‌ఎస్ రెడ్డి, పూర్వాధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర, డా. ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి శాలువా కప్పి, జ్ఞాపికను అందించారు. అనంతరం వీర్నపు సత్యనారాయణ మాట్లాడుతూ.. వందేమాతరం శ్రీనివాస్ ఈ కార్యక్రమానికి రావడం ఆనందంగా ఉందని, ఇటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సహకరించిన అందరికీ కృతజ్ఞతలను తెలిపారు. ఈ కార్యక్రమంలో టాంటెక్స్ పూర్వధ్యక్షులు సుబ్రహ్మణ్యం జొన్నలగడ్డ, విశ్వనాద్ పులిగండ్ల, రావు కలవల, డా. పూదుర్ జగదీశ్వరన్, సి.ఆర్.రావు, లెనిన్ వేముల, డా. రమణ జువ్వాడి, చంద్రహాస్ మద్దుకూరి తదితరులు పాల్గొన్నారు. -
దాసరి దేవుడు, నా సర్వస్వం...
ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు ఇక లేరన్న వార్త వినగానే ఒక క్షణం పాటు మనసంతా కకావికలం అయిందని సంగీత దర్శకుడు, గాయకుడు వందేమాతరం శ్రీనివాసరావు అన్నారు. దాసరి మహోన్నతమైన వ్యక్తి అని, ఆయన దగ్గర పనిచేయడం నిజంగా అదృష్టమన్నారు. ‘ఓసే రాములమ్మ’ చిత్రంలో పాటను తనతో దాసరి పట్టుబట్టి మరీ పాడించారని వందేమాతరం తెలిపారు. ఈ సందర్భంగా దాసరితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. దాసరి ఇక లేరనేది.. తెలుగు చిత్ర పరిశ్రమకు దురదృష్టకరమైన వార్త అన్నారు. గీత రచయిత సుద్దాల అశోక్ తేజ మాట్లాడుతూ...’ దాసరి నారాయణరావు నా దేవుడు, నా జీవితం...నా సర్వస్వం. ఆయన లేకుండా ఈ రోజు సుద్దాల అశోక్ తేజ లేడు. గత 22 ఏళ్లుగా ఆయన సొంతబిడ్డలా నన్ను చూసుకున్నారు.’ అని అన్నారు. అలాగే మహోన్నత శిఖరం ఇక లేరనే వార్తను నమ్మలేకపోతున్నానని సుద్దాల అశోక్ తేజ పేర్కొన్నారు. -
ఈ పాటకు ట్యూన్ తెలుసా?
పల్లవి : భూమికి పచ్చాని రంగేసిన ట్టో అమ్మలాలా పంటచేలు పెరగాలి ఓయమ్మలాలో అమ్మలాలా ఆలి పుస్తెలమ్ముకొని అప్పు తీర్చుకుంటివో అమ్మలాలా వలవలవల ఏడ్చుకుంటూ వలసెల్లిపోతివో అమ్మలాలా పురుగులమందే నీకు పెరుగన్నమాయనో అమ్మలాలా చెరవీడి భూతల్లి చెంతకు చేరిందిరో పంటలు చేతికొస్తే పండుగ చేద్దామురో ॥ చరణం : 1 జాతరమ్మ జాతరమ్మ కూలిజనం జాతరో అమ్మలాలా ఎత్తుపల్లాలనే చదును చేసే జాతరో అమ్మలాలా చేలు దున్ని చాళ్లుదీసె బీదబిక్కి జాతరో అమ్మలాలా ఎద్దుకొమ్మల నడుమ ఎర్రపొద్దు పొడిచెరో భూస్వామి గుండెలధర గుడిసెలోల్ల జాతర ॥ చరణం : 2 చెమట జల్లు చిలకరిస్తే నేల పులకించురో అమ్మలాలా వానొస్తే భూతల్లి శీమంతమాడురో అమ్మలాలా తంగెళ్లు గన్నేర్లు పసుపు కుంకుమిచ్చురో అమ్మలాలా పశుల మెడన చిరుగజ్జెలు ఘల్లున మ్రోగేనో గజ్జెల మోతల్లో పల్లె పరవశించెను ॥ చరణం : 3 ఎగువ పెన్నమ్మమతల్లి ఎగిరెగిరి దుమికితే అమ్మలాలా తుంగభద్రమ్మ పొంగి పరవళ్లు తొక్కితే అమ్మలాలా చిత్రంగ చిత్రావతి చిందులు ఆడితే అమ్మలాలా నేలతల్లి నీళ్లాడి పసిడిపంటలిచ్చురో నా సీమకన్నుల్లో వెలుగులు నిండేనురో ॥ చిత్రం : శ్రీరాములయ్య (1998) రచన : కలెకూరి ప్రసాద్ సంగీతం : వందేమాతరం శ్రీనివాస్ గానం : కె.జె.ఏసుదాస్, బృందం -
'స్వామి వివేకానంద' సినిమా స్టిల్
-
‘ప్రేమించాలి’... ‘సీతాకోక చిలుక’ను గుర్తుచేసింది - వందేమాతరం
ప్రేమిస్తే, షాపింగ్‌మాల్, జర్నీ, నాన్న, పిజ్జా... నిర్మాతగా సురేష్ కొండేటి ఉత్తమాభిరుచికి అద్దం పట్టే సినిమాలు. వాటికి ఏ మాత్రం తగ్గని రీతిలో... ఆయన సంస్థ నుంచి రాబోతున్న ‘ప్రేమించాలి’ సినిమా ఉంది’’ అని వందేమాతరం శ్రీనివాస్ అన్నారు. సంతోష్, మనీషా జంటగా సుశీంద్రన్ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం ‘ఆదలాల్ కాదల్ సెయ్‌వీర్’. తమిళనాట ఘన విజయం సాధించిన ఈ చిత్రాన్ని ‘ప్రేమించాలి’ పేరుతో తెలుగులోకి విడుదల చేస్తున్నారు సురేష్ కొండేటి. ఈ చిత్రంలో కీలక సన్నివేశంలో వచ్చే ఓ పాటను భాస్కరభట్ల రాయగా వందేమాతరం శ్రీనివాస్ ఆలపించారు. ఈ సందర్భంగా చిత్రాన్ని తిలకించిన వందేమాతరం ‘ప్రేమించాలి’ గురించి మాట్లాడారు. ‘‘చిన్న సినిమాలతో ప్రయోగాలు చేయడంలో తమిళ సినిమా ఎప్పుడూ ముందే ఉంటుంది. చిన్న సినిమాగా విడుదలై 16 కోట్లు వసూలు చేసిందంటే... ఈ సినిమా కెపాసిటీ ఏంటో అర్థం చేసుకోవచ్చు. నాటి ‘సీతాకోక చిలుక’ చిత్రాన్ని గుర్తుచేసిందీ సినిమా. సుశీంద్రన్ ట్రీట్మెంట్ నిజంగా సూపర్బ్. హృదయాలకు హత్తుకునే సినిమా ఇది. ఈ సినిమాలో ఓ మంచి పాట పాడే అవకాశం దొరికినందుకు ఆనందంగా ఉంది. యువన్‌శంకర్‌రాజా ఆణిముత్యాల్లాంటి పాటలిచ్చారు. సాంకేతికంగా కూడా రిచ్‌గా ఉందీ సినిమా. భాషా బేదం లేకుండా అందరికీ నచ్చుతుంది’’ అన్నారు. ఈ నెల ప్రథమార్ధంలో పాటలను, ద్వితీయార్ధంలో సినిమాను విడుదల చేస్తామని సురేష్ కొండేటి చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: సూర్య వి.ఆర్, కూర్పు: ఆంటోని, సహనిర్మాత: సమన్యరెడ్డి. -
గీత స్మరణం
పల్లవి : అతడు: ఇదే నా పల్లెటూరు ఇదే నా తల్లిగారు మావూరి పాడిపంట రాములోరి దీవెనంటా తల్లీ గోదావరి నీళ్లు కడిగే సీతమ్మ పాదాలు ఊరంతా హాయ్ హాయ్ హాయ్... మనసంతా హాయ్ హాయ్ హాయ్... ॥నా పల్లెటూరు॥ చరణం : 1 ఆమె: రామునికి బాణమొకటే భార్య సీతమ్మ ఒకటి ఆ రాముడంటి కొడకు ఇంటింటా ఉంటే ఒకడు ఊరంతా హాయ్ హాయ్ హాయ్... మనసంతా జాయ్ జాయ్ జాయ్... అ: ఒక దేవుడే తనకు ఒక ధర్మమే తనది హనుమంతుడే మనకు ఆదర్శమే ఐతే ఊరంతా హాయ్ హాయ్ హాయ్... మనసంతా హాయ్ హాయ్ హాయ్... ॥నా పల్లెటూరు॥ చరణం : 2 ఆ: తొలకరిలో వానచుక్క రుచిచూస్తే తేనెచుక్క భూమిపై మోముపైన చిన్ని గరిక నవ్వుతుంటే ఊరంతా హాయ్ హాయ్ హాయ్... మనసంతా జాయ్ జాయ్ జాయ్... అ: ఆలమంద పాలధార మీటుతున్నదో సితార కడుపునిండా పాలు తాగి లేగదూడలాడుతుంటే ఊరంతా హాయ్ హాయ్ హాయ్... మనసంతా హాయ్ హాయ్ హాయ్... ॥నా పల్లెటూరు॥ చిత్రం : భద్రాచలం (2001); రచన : సుద్దాల అశోక్‌తేజ సంగీతం : వందేమాతరం శ్రీనివాస్; గానం : వందేమాతరం శ్రీనివాస్, ఉష నిర్వహణ: నాగేష్