దాసరి దేవుడు, నా సర్వస్వం... | suddala ashok teja respond on dasari narayana rao demise | Sakshi
Sakshi News home page

దాసరి దేవుడు, నా సర్వస్వం...

May 30 2017 7:46 PM | Updated on Sep 5 2017 12:22 PM

దాసరి దేవుడు, నా సర్వస్వం...

దాసరి దేవుడు, నా సర్వస్వం...

ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు ఇక లేరన్న వార్త వినగానే ఒక క్షణం పాటు మనసంతా కకావికలం అయిందని సంగీత దర్శకుడు, గాయకుడు వందేమాతరం శ్రీనివాసరావు అన్నారు.

ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు ఇక లేరన్న వార్త వినగానే ఒక క్షణం పాటు మనసంతా కకావికలం అయిందని సంగీత దర్శకుడు, గాయకుడు వందేమాతరం శ్రీనివాసరావు అన్నారు. దాసరి మహోన్నతమైన వ్యక్తి అని, ఆయన దగ్గర పనిచేయడం నిజంగా    అదృష్టమన్నారు. ​‘ఓసే రాములమ్మ’ చిత్రంలో పాటను తనతో దాసరి పట్టుబట్టి మరీ పాడించారని వందేమాతరం తెలిపారు. ఈ సందర్భంగా దాసరితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. దాసరి ఇక లేరనేది.. తెలుగు చిత్ర పరిశ్రమకు దురదృష్టకరమైన వార్త అన్నారు.

గీత రచయిత సుద్దాల అశోక్‌ తేజ మాట్లాడుతూ...’ దాసరి నారాయణరావు నా దేవుడు, నా జీవితం...నా సర్వస్వం. ఆయన లేకుండా ఈ రోజు సుద్దాల అశోక్‌ తేజ లేడు. గత 22 ఏళ్లుగా  ఆయన  సొంతబిడ్డలా నన్ను చూసుకున్నారు.’  అని అన్నారు. అలాగే మహోన్నత శిఖరం ఇక లేరనే వార్తను నమ్మలేకపోతున్నానని సుద్దాల అశోక్‌ తేజ పేర్కొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement