dasari passed away
-
అధికార లాంఛనాలతో దాసరి అంత్యక్రియలు
-
అధికార లాంఛనాలతో దాసరి అంత్యక్రియలు
హైదరాబాద్ : ప్రముఖ దర్శకుడు, నిర్మాత దాసరి నారాయణరావు అంత్యక్రియలు కుటుంబసభ్యులు, ఆత్మీయులు, అభిమానుల అశ్రునయనాల మధ్య ముగిశాయి. మొయినాబాద్ మండలం తోల్కట్ట సమీపంలోని సొంత వ్యవసాయక్షేత్రం పద్మా గార్డెన్స్‌లో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. దాసరి పెద్ద కుమారుడు ప్రభు... తండ్రి చితికి నిప్పంటించారు. అంతకు ముందు ఫిల్మ్‌చాంబర్ నుంచి దాసరి అంతిమ యాత్ర జరిగింది. దాసరిని కడసారి చూసేందుకు సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు భారీగా తరలివచ్చారు. కాగా నాలుగేళ్ల క్రితం ఆయన భార్య దాసరి పద్మ అంత్యక్రియలు సైతం ఇక్కడే నిర్వహించారు. [ ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి ] -
పవన్ తో దాసరి 'బోస్' కల నెరవేరకుండానే..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శక రత్న దాసరి నారాయణరావుల కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కనుందన్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని పవన్, దాసరిలు గతంలో స్వయంగా ప్రకటించారు. అయితే ఈ కాంబినేషన్‌కు తగ్గ కథ కోసం చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల పవన్ పుట్టిన రోజు సందర్భంగా తమ తారక ప్రభు ఫిలింస్ బ్యానర్లో 38వ సినిమాగా పవన్‌తో సినిమాను నిర్మిస్తున్నట్టుగా దాసరి యాడ్ కూడా ఇచ్చారు. దీంతో త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుందని, ఈ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తారని వార్తలు వెలువడ్డాయి కూడా. ఈ నేపథ్యంలో తాజాగా దాసరి, బోస్ అనే టైటిల్‌ను ఫిలిం ఛాంబర్లో రిజిస్టర్ చేయించారు. దీంతో పవన్ హీరోగా తెరకెక్కబోయే సినిమాకు ఇదే టైటిల్ అన్న ప్రచారం జోరుగా జరిగింది. పవన్ దాసరిలకు సినీ రంగంతో పాటు రాజకీయ నేపథ్యం కూడా ఉంది. దీంతో ఈ ఇద్దరి కాంబినేషన్లో రాబోయే సినిమా కూడా ఈ అంశాలను ప్రతిభించేలాగే ఉంటుందన్న టాక్ వినిపించింది. ఇదే విషయాన్ని దాసరి...చిరంజీవి ఖైదీ నెంబర్ 150 చిత్రం సందర్భంగా కూడా ప్రస్తావించారు. అయితే ఇంతలోనే దాసరి నారాయణరావు అనారోగ్యానికి గురవడం... అనంతరం కోలుకున్నారు. దీంతో మళ్లీ వీరిద్దరి కాంబినేషన్‌పై చర్చలు జరిగినప్పటికీ దాసరి హఠాత్ మరణంతో ‘బోస్’ చిత్రం ప్రశ్నార్థకంగా మారింది. -
రాజకీయ పార్టీ పెట్టాలనుకున్న దాసరి
చలనచిత్ర రంగంలో రికార్డు స్థాయిలో సినిమాలకు దర్శకత్వం వహించి, అనేక మందిని వెండితెరకు పరిచయం చేసిన దాసరి నారాయణరావు రాజకీయాల్లోనూ రాణించారు. కాపు సామాజికవర్గంలో మంచి పేరు సంపాదించుకున్న ఆయన 1996లో కాపు సామాజికవర్గాన్ని ఆలంబనగా చేసుకొని తెలుగుతల్లి పేరుతో ఓ రాజకీయ పార్టీ స్థాపించాలని ప్రయత్నించారు. కాని కాంగ్రెస్ పార్టీ ఆ ప్రయత్నాన్ని అడ్డుకుంది. పార్టీపరంగా సముచిత గౌరవమిస్తామని ప్రకటించడంతో పార్టీ ఏర్పాటు ప్రక్రియను విరమించుకున్నారు. దీంతో 1996, 1998, 1999 ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ తరపున ప్రచారం చేశారు. దాసరి అందించిన సేవలకు ప్రతిగా ఆయనను కాంగ్రెస్ పార్టీ రెండు వేల సంవత్సరంలో రాజ్యసభ సభ్యుడిగా నియమించింది. 2004లో యూపీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన కేంద్రంలో బొగ్గు, గనుల శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2008లో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల కారణంగా ఆయన కేంద్ర మంత్రిగా తప్పుకున్నారు. 2012 వరకు ఆయన రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. అలాగే కాపు ఉద్యమంలోనూ దాసరి చురుకైన పాత్ర పోషించారు. -
దాసరి మృతిపట్ల వైఎస్ జగన్ సంతాపం
హైదరాబాద్ : ప్రముఖ దర్శక, నిర్మాత దాసరి నారాయణరావు మృతి పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంతాపం తెలిపారు. దాసరి మరణం తెలుగు సినీ రంగానికి తీరని లోటు అని, అన్నారు. దశాబ్దాల పాటు దాసరి తెలుగు సినీ రంగానికి పెద్ద దిక్కుగా ఉన్నారని, సినిమా రంగంలో ఆయన ఒక యుగకర్త అని పేర్కొన్నారు. రికార్డు స్థాయిలో 150కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించిన మహా దర్శకుడిగా మాత్రమే కాకుండా, నటుడిగా, రచయితగా, నిర్మాతగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా, పత్రికాధిపతిగా, మంచి మనిషిగా దాసరి ఎప్పటికీ చిరస్మరణీయులని వైఎస్ జగన్ అన్నారు. దాసరి తెలుగు సినిమా రంగంలతో ఒక విప్లవాన్ని సృష్టించారని, కథే హీరోగా ఆయన తిరుగులేని చిత్రాలను నిర్మించారని పేర్కొన్నారు. దాసరి ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని, ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. Deeply saddened to know of the demise of Dasari NarayanaRao garu, an Indian cinema legend. Heartfelt condolences to his family members. — YS Jagan Mohan Reddy (@ysjagan) 30 May 2017 -
భోరున విలపించిన మోహన్ బాబు
-
భోరున విలపించిన మోహన్ బాబు
హైదరాబాద్ : దాసరి నారాయణరావు మృతితో తెలుగు చిత్ర పరిశ్రమలో మూలస్థంభాన్ని కోల్పోయామని నటుడు మోహన్ బాబు అన్నారు. దాసరి లేరన్న వార్తను జీర్ణించుకోలేకపోతున్నట్లు ఆయన ఈ సందర్భంగా మీడియా ఎదుట భోరున విలపించారు. దాసరి తనకు తండ్రి తర్వాత తండ్రి లాంటి వాడని, నటనలో తనకు ఓనమాలు నేర్పిన గురువు అని చెప్పుకొచ్చారు. తనకు నటుడిగా గుర్తింపునిచ్చిన దాసరి గారి మరణాన్ని జీర్ణించుకోవడం కష్టంగానే ఉన్నా.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ సాయినాధుని సాక్షిగా కోరుకొంటున్నాని మోహన్ బాబు అన్నారు. తనకు నటుడుగా దాసరి జన్మినిచ్చారన్నారు. నటుడిగా తనకో జీవితాన్ని ప్రసాదించారని తెలిపారు. కన్నతల్లి కన్నా ఎక్కువగా తన గురువు దాసరి, ఆయన సతీమణి వద్దే ఎక్కువ సమయాన్ని గడిపానని దర్శకుడు రేలంగి నరసింహారావు అన్నారు. అస్తమించిన తెలుగు శిఖరం: బోయపాటి శీను ‘దర్శక ద్రోణాచార్యుడు మా దాసరి గారు మా మధ్య లేరనే వార్త నా మనసుని కలచివేసింది. ఆయన మరణం తెలుగు సినిమాకి తీరని లోటు.ఆయన చూపిన బాటలో మా దర్శకులం అందరం నడిచి.. ఆయన ఆశయాన్ని నెరవేరుస్తాం’ అని అన్నారు. అలాగే దాసరి లేని లోటు తీర్చలేనిదన్నారు సాక్షి ఎడిటోరియల్ డైరక్టర్ రామచంద్రమూర్తి అన్నారు. ఆయన అసమాన ప్రతిభావంతుడని కొనియాడారు. ఈ సందర్భంగా ఉదయం పత్రికలో పని చేసినప్పుడు దాసరితో గల అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. -
దాసరి దేవుడు, నా సర్వస్వం...
ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు ఇక లేరన్న వార్త వినగానే ఒక క్షణం పాటు మనసంతా కకావికలం అయిందని సంగీత దర్శకుడు, గాయకుడు వందేమాతరం శ్రీనివాసరావు అన్నారు. దాసరి మహోన్నతమైన వ్యక్తి అని, ఆయన దగ్గర పనిచేయడం నిజంగా అదృష్టమన్నారు. ‘ఓసే రాములమ్మ’ చిత్రంలో పాటను తనతో దాసరి పట్టుబట్టి మరీ పాడించారని వందేమాతరం తెలిపారు. ఈ సందర్భంగా దాసరితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. దాసరి ఇక లేరనేది.. తెలుగు చిత్ర పరిశ్రమకు దురదృష్టకరమైన వార్త అన్నారు. గీత రచయిత సుద్దాల అశోక్ తేజ మాట్లాడుతూ...’ దాసరి నారాయణరావు నా దేవుడు, నా జీవితం...నా సర్వస్వం. ఆయన లేకుండా ఈ రోజు సుద్దాల అశోక్ తేజ లేడు. గత 22 ఏళ్లుగా ఆయన సొంతబిడ్డలా నన్ను చూసుకున్నారు.’ అని అన్నారు. అలాగే మహోన్నత శిఖరం ఇక లేరనే వార్తను నమ్మలేకపోతున్నానని సుద్దాల అశోక్ తేజ పేర్కొన్నారు.