డల్లాస్‌లో వందేమాతరం శ్రీనివాస్‌కు సత్కారం | TANTEX Felicitated Vandemataram Srinivas In Dallas | Sakshi
Sakshi News home page

డల్లాస్‌లో వందేమాతరం శ్రీనివాస్‌కు సత్కారం

Published Sat, Jun 15 2019 12:47 PM | Last Updated on Sat, Jun 15 2019 12:47 PM

TANTEX Felicitated Vandemataram Srinivas In Dallas - Sakshi

డల్లాస్‌ : ఉత్తర టెక్సాస్‌ తెలుగు సంఘం (టాంటెక్స్‌) ఆధ్వర్యంలో జూన్‌ 11న దేశీప్లాజాలో ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు వందేమాతరం శ్రీనివాస్‌ను ఘనంగా సత్కరించారు. ఆయనను.. టాంటెక్స్‌ కార్యదర్శి మహేష్‌ పార్నపల్లి, ఉత్తరాధ్యక్షులు కృష్ణారెడ్డి కోడూరు, శ్రీకాంత్‌ రెడ్డిజొన్నల పుష్పగుచ్చంతో వేదిక మీదకు ఆహ్వానించారు. ఆయనతో ముఖాముఖి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. 

టాంటెక్స్‌ అధ్యక్షులు వీర్నపు చినసత్యం, కార్యదర్శి మహేష్‌ పార్నపల్లి, ఉత్తరాధ్యక్షులు కృష్ణారెడ్డి కోడూరు, శ్రీకాంత్‌ రెడ్డిజొన్నల, పాలకమండలి అధిపతి ఎన్‌ఎమ్‌ఎస్‌ రెడ్డి, పూర్వాధ్యక్షులు డా. ప్రసాద్‌ తోటకూర, డా. ఆళ్ల శ్రీనివాస్‌ రెడ్డి శాలువా కప్పి, జ్ఞాపికను అందించారు. అనంతరం వీర్నపు సత్యనారాయణ మాట్లాడుతూ.. వందేమాతరం శ్రీనివాస్‌ ఈ కార్యక్రమానికి రావడం ఆనందంగా ఉందని, ఇటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సహకరించిన అందరికీ కృతజ్ఞతలను తెలిపారు. ఈ కార్యక్రమంలో టాంటెక్స్‌ పూర్వధ్యక్షులు సుబ్రహ్మణ్యం జొన్నలగడ్డ, విశ్వనాద్‌ పులిగండ్ల, రావు కలవల, డా. పూదుర్‌ జగదీశ్వరన్‌, సి.ఆర్‌.రావు, లెనిన్‌ వేముల, డా. రమణ జువ్వాడి, చంద్రహాస్‌ మద్దుకూరి తదితరులు పాల్గొన్నారు.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement