హైదరాబాద్ చేరిన శ్రీహరి భౌతిక కాయం | Srihari's Body Reached Hyderabad | Sakshi
Sakshi News home page

Published Thu, Oct 10 2013 9:49 AM | Last Updated on Thu, Mar 21 2024 9:10 AM

సినీ నటుడు శ్రీహరి భౌతికకాయం గురువారం ఉదయం ఆయన నివాసానికి చేరింది. ఆయన మృతదేహాన్ని కుటుంబ సభ్యులు ముంబయి నుంచి హైదరాబాద్ తీసుకు వచ్చారు. శ్రీహరి అంత్యక్రియలు ఈరోజు మధ్యాహ్నం బాచుపల్లిలోని సొంత వ్యవసాయ క్షేత్రంలో జరగనున్నాయి. ఆయన కుమార్తె అక్షర అంత్యక్రియలు కూడా అదే వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించనున్నారు. హిందీ చిత్రం రాంబో రాజ్కుమార్ షూటింగ్లో పాల్గొన్న శ్రీహరి మంగళవారం అస్వస్థతకు గురయ్యారు. దాంతో ఆయనను అక్కడే లీలావతి ఆస్పత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ ఆయన నిన్న తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. మరోవైపు శ్రీహరి భౌతికకాయాన్ని దర్శించేందుకు సినీ ప్రముఖులు ఆయన నివాసానికి చేరుకుంటున్నారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement