Srihari Body
-
శ్రీహరి అంత్యక్రియలు పూర్తి
-
శ్రీహరికి ప్రముఖుల నివాళులు-part 2
-
శ్రీహరికి ప్రముఖుల నివాళులు-Part 1
-
శ్రీహరి నివాసానికి అభిమానుల తాకిడి
-
హైదరాబాద్ చేరిన శ్రీహరి భౌతిక కాయం
-
శ్రీహరి నివాసానికి అభిమానుల తాకిడి
హైదరాబాద్ : తమ అభిమాన నటుడు శ్రీహరిని కడసారి చూపు చేసేందుకు ఆయన నివాసానికి అభిమానులు పోటెత్తారు. శ్రీహరి భౌతికకాయాన్ని కొద్దిసేపటి క్రితమే ఆయన నివాసం జూబ్లీహిల్స్‌కు చేరుకుంది. దాంతో శ్రీహరిని చూసేందుకు అభిమానులు వెల్లువెత్తుతున్నారు. రియల్ స్టార్ అమర్ హై అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. శ్రీహరిని అంజలి ఘటించేందుకు సినీ ప్రముఖులే కాకుండా, రాజకీయ నేతలు, అభిమానులు ఆయన ఇంటికి తరలి వచ్చారు. మంచితనానికి మారుపేరు శ్రీహరి అన్న అంటూ అభిమానులు శ్రీహరి భౌతికకాయాన్ని చూసి కన్నీటి పర్యంతం అవుతున్నారు. రియల్ స్టార్ ఇక లేరు అనేది జీర్ణించుకోలేక పోతున్నట్లు తెలిపారు. శ్రీహరి లేని లోటును పూడ్చలేమన్నారు. సాయంత్రం బాచుపల్లిలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. -
హైదరాబాద్ చేరిన శ్రీహరి భౌతిక కాయం
హైదరాబాద్ : సినీ నటుడు శ్రీహరి భౌతికకాయం గురువారం ఉదయం ఆయన నివాసానికి చేరింది. ఆయన మృతదేహాన్ని కుటుంబ సభ్యులు ముంబయి నుంచి హైదరాబాద్ తీసుకు వచ్చారు. శ్రీహరి అంత్యక్రియలు ఈరోజు మధ్యాహ్నం బాచుపల్లిలోని సొంత వ్యవసాయ క్షేత్రంలో జరగనున్నాయి. ఆయన కుమార్తె అక్షర అంత్యక్రియలు కూడా అదే వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించారు. హిందీ చిత్రం రాంబో రాజ్‌కుమార్ షూటింగ్లో పాల్గొన్న శ్రీహరి మంగళవారం అస్వస్థతకు గురయ్యారు. దాంతో ఆయనను అక్కడే లీలావతి ఆస్పత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ ఆయన నిన్న తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. మరోవైపు శ్రీహరి భౌతికకాయాన్ని దర్శించేందుకు సినీ ప్రముఖులు ఆయన నివాసానికి చేరుకుంటున్నారు.