'పోలీస్ గేమ్' ఏంటి? | Srihari casts main role in "police game" | Sakshi
Sakshi News home page

'పోలీస్ గేమ్' ఏంటి?

Published Wed, Sep 18 2013 1:03 AM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM

'పోలీస్ గేమ్' ఏంటి? - Sakshi

'పోలీస్ గేమ్' ఏంటి?

శ్రీహరి ప్రధాన పాత్రధారునిగా రూపొందిన చిత్రం ‘పోలీస్ గేమ్’. సహదేవరెడ్డి డి.వి దర్శకుడు. సుజాతా దేవా నిర్మాత. ఈ నెల 20న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా సహదేవరెడ్డి మాట్లాడుతూ -‘‘డ్రగ్స్ వల్ల యువతరం ఎలా నిర్వీర్యం అవుతోంది? పిల్లలు సంఘ విద్రోహులుగా తయారవ్వడంతో పెద్దల పాత్ర ఎంత? అనే ఆసక్తికరమైన కథాంశంతో ఈ చిత్రం ఉంటుంది. 
 
 శ్రీహరి పోరాటాలు, నటన ఈ చిత్రానికి హైలైట్’’ అని తెలిపారు. అన్ని వర్గాల వారినీ ఆకట్టుకునే సినిమా ఇదని ఈ చిత్రాన్ని పంపిణీ చేస్తున్న నట్టికుమార్ తెలిపారు. 
 
 ఇంకా సమర్పకుడు నాగవల్లి శంకర్ కూడా మాట్లాడారు. కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, జీవా, రంగనాథ్ తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా: భాస్కర జాస్తి, సంగీతం: ఎం.ఎం.శ్రీలేఖ.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement