Sahadeva Reddy
-
సహకార బ్యాంకుల ఖాళీల భర్తీకి గ్రీన్ సిగ్నల్
కడప అగ్రికల్చర్, న్యూస్‌లైన్: జిల్లా సహకార బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న పోస్టులన్నీ భర్తీ చేసేందుకు గ్రీన్‌సిగ్నల్ వచ్చినట్లు జిల్లా సహకార బ్యాంకు చీప్ మేనేజరు సహదేవరెడ్డి తెలిపారు. గురువారం సాయంత్రం జిల్లా కేంద్ర బ్యాంకులో సమావేశ మందిరంలో చైర్మన్ ఇరగంరెడ్డి తిరుపాల్‌రెడ్డితో కలిసి బ్యాంకు క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సహదేవరెడ్డి మాట్లాడుతూ బ్యాంకుల్లో ఉన్న 31 ఖాళీలను భర్తీ చేయాలని కోర్టు ఆదేశించిందని అన్నారు. 2012 ఫిబ్రవరిలో 46 పోస్టులు, అదే ఏడాది మార్చిలో మరో 46 పోస్టులకు ఇంటర్వ్యూలు పూర్తి అయ్యాయన్నారు. కోర్టుకు కొందరు అభ్యర్థులు వెళ్లడంతో 31 పోస్టులు ఆగిపోయాయని, వాటికి మళ్లీ ఇంటర్వ్యూలు ఇప్పుడు నిర్వహించనున్నామన్నారు. బ్యాంకు వ్యాపార లావాదేవీలు పెరిగినందున మరో 60 పోస్టులు అవసరం అని వాటిని భర్తీ చేయడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు. అవుట్ సోర్సింగ్ అనేదే లేకుండా చేయడానికి ఖాళీలన్నింటిని పారదర్శకంగా చేయనున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్‌లో పంట రుణాలు రూ.194 కోట్లకుగాను రూ. 178 కోట్ల రుణాలను రైతులకు అందజేశామన్నారు. ఈ రబీలో రూ. 190 కోట్ల లక్ష్యానికి గాను ఇప్పటి వరకు రూ. 4.60 కోట్లు ఇచ్చామన్నారు. దీర్ఘకాలిక పంట రుణాలు రూ. 7 కోట్లు ఇవ్వనున్నామన్నారు. బ్యాంకులకు 2006 కంటే ముందు బకాయి ఉన్న వారందరు అసలు, వడ్డీ కలిపి మొత్తం చెల్లిస్తే 35 శాతం రాయితీ ఇస్తామన్నారు. ఈ అవకాశం జనవరి 30 వరకు మాత్రమే ఉంటుందన్నారు. -
'పోలీస్ గేమ్' ఏంటి?
శ్రీహరి ప్రధాన పాత్రధారునిగా రూపొందిన చిత్రం ‘పోలీస్ గేమ్’. సహదేవరెడ్డి డి.వి దర్శకుడు. సుజాతా దేవా నిర్మాత. ఈ నెల 20న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా సహదేవరెడ్డి మాట్లాడుతూ -‘‘డ్రగ్స్ వల్ల యువతరం ఎలా నిర్వీర్యం అవుతోంది? పిల్లలు సంఘ విద్రోహులుగా తయారవ్వడంతో పెద్దల పాత్ర ఎంత? అనే ఆసక్తికరమైన కథాంశంతో ఈ చిత్రం ఉంటుంది. శ్రీహరి పోరాటాలు, నటన ఈ చిత్రానికి హైలైట్’’ అని తెలిపారు. అన్ని వర్గాల వారినీ ఆకట్టుకునే సినిమా ఇదని ఈ చిత్రాన్ని పంపిణీ చేస్తున్న నట్టికుమార్ తెలిపారు. ఇంకా సమర్పకుడు నాగవల్లి శంకర్ కూడా మాట్లాడారు. కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, జీవా, రంగనాథ్ తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా: భాస్కర జాస్తి, సంగీతం: ఎం.ఎం.శ్రీలేఖ.