ఆకట్టుకునే కథా కథనాలతో... | Srihari last film Siva Keshav reday for Release | Sakshi
Sakshi News home page

ఆకట్టుకునే కథా కథనాలతో...

Published Sat, Jun 7 2014 11:08 PM | Last Updated on Sat, Sep 2 2017 8:27 AM

ఆకట్టుకునే కథా కథనాలతో...

ఆకట్టుకునే కథా కథనాలతో...

 శ్రీహరి నటించిన చివరి చిత్రం ‘శివకేశవ్. సీతారామ ఫిలింస్ పతాకంపై బానూరు శ్రావణి-సాయినాథ్ సమర్పణలో బానూరు నాగరాజు (జడ్చర్ల) ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆర్వీ సుబ్రహ్మణ్యం దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ -‘‘శ్రీహరి నటన, ఆయన చేసిన రిస్కీ ఫైట్స్ ఈ సినిమాకి హైలైట్‌గా నిలుస్తాయి. జయంత్ అద్భుతంగా నటించాడు. దర్శకుడికి ఇది మొదటి సినిమా అయినా బాగా తెరకెక్కించాడు. శివకేశవ్ ఎవరు? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఆకట్టుకునే కథా కథనాలతో సాగే యాక్షన్ ఎంటన్‌టైనర్ ఇది’’ అని చెప్పారు. జయంత్, సంజన, శ్వేతాబసుప్రసాద్, గుర్లిన్ చోప్రా తదితరులు నటించిన ఈ చిత్రానికి సహనిర్మాత: బానూరు మాలతి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement