అంబరీష్‌తో జాగ్రత్త | wrong rumors on ambarish says sumalatha | Sakshi
Sakshi News home page

అంబరీష్‌తో జాగ్రత్త

Published Mon, Mar 30 2015 2:21 AM | Last Updated on Sat, Sep 2 2017 11:33 PM

అంబరీష్‌తో జాగ్రత్త

అంబరీష్‌తో జాగ్రత్త

 నటుడు అంబరీష్‌తో జాగ్రత్తగా ఉండాలని నటి సుహాసిని చెప్పినట్లు నటి సుమలత చెప్పారు. సినీ రంగంలో సహ నటీనటుల్ని ప్రేమించి పెళ్లి చేసుకున్న వారి సంసార జీవితాల్లో చాలా మట్టుకు సమస్యలమయంగా సాగుతున్నది అనేది ఎవరూ కాదనలేని విషయం అలాగని సంతోషంగా జీవిస్తున్న వారు లేరని చెప్పలేం. అలా జీవితాన్ని అన్యోన్యంగా మలచుకునే నటి జంటల్లో కన్నడ నటుడు అంబరీష్, నటి సుమలత ఒకరు. సుమలత 1990 ప్రాంతంలో తమిళం, తెలుగు, కన్నడం చిత్ర పరిశ్రమల్లో ప్రముఖ హీరోయిన్‌గా వెలుగొందారు. ఇక అంబరీష్ కన్నడ చిత్ర పరిశ్రమలో సూపర్‌స్టార్‌గా రాణించారు.
 
 ఈయన తమిళంలోనూ కొన్ని చిత్రాలు చేశారు. నటుడు రజనీకాంత్‌కు మంచి మిత్రుడు. అంబరీష్, సుమలత  ఒకరి నొకరు ప్రేమించుకున్నారు. ఆ సమయంలో అంబరీష్‌తో జాగ్రత్తగా ఉండు అని హెచ్చరించిన వారిలో నటి సుహాసిని కూడా ఉన్నారట. ఈ విషయాన్ని నటి సుమలత స్వయంగా చెప్పడం విశేషం. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన గతాన్ని నెమరువేసుకున్న ఆమె తన సుదీర్ఘ వివాహ జీవితం గురించి చెబుతూ వివాహానికి ముందు తన భర్త అంబరీష్‌తో కలసి పలు చిత్రాల్లో నటించానన్నారు.
 
  ఆయనతో తన జీవితాన్ని పంచుకోవాలని భావించినప్పుడు నటి సుహాసినితో పాటు పలువురు అంబరీష్‌తో జాగ్రత్తగా ఉండు అంటూ హెచ్చరించారన్నారు. తన మేకప్‌మన్ కూడా అంబరీష్‌కు దూరంగా ఉండాలని సలహా ఇచ్చారన్నారు. అయినా అంబరీషే తనకు నచ్చడంతో ఆయన్నే ప్రేమించి పెళ్లి చేసుకున్నానని, ఇప్పటి వరకు తమ దాంపత్య జీవితం హాయిగా సాగుతోందని చాలా సంతోషంగా జీవిస్తున్నట్లు పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement