TRS Supporters Stopped Nandamuri Suhasini's Campaign in Kukatpally - Sakshi
Sakshi News home page

సుహాసిని ప్రచారాన్ని అడ్డుకున్న టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు

Published Mon, Nov 26 2018 10:09 AM | Last Updated on Mon, Nov 26 2018 3:44 PM

TRS Supports Stop Suhasini Campaign In Kukatpally - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కూకట్‌పల్లి ప్రజాకూటమి అభ్యర్థి నందమూరి సుహాసినికి ప్రచారంలో చేదు అనుభవాలే ఎదురవుతున్నాయి. తొలుత ఆమెను కూకట్‌పల్లి అభ్యర్థిగా ప్రకటించినప్పుడు కాంగ్రెస్‌ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయగా.. ఇప్పుడ టీఆర్‌ఎస్‌ నుంచి ఊహించని నిరసనను ఎదుర్కొంటున్నారు. ప్రచారంలో భాగంగా సోమవారం కూకట్‌పల్లిలోని అల్లాపూర్‌ డివిజన్‌లో పర్యటించారు. దీనిలో టీఆర్‌ఎస్‌, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ తీవ్ర కలకలం రేపింది.

డివిజన్‌లోని టీఆర్‌ఎస్‌ కార్యాలయం ముందు నుంచి సుహాసిని వెళ్తుండగా టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ఆమెను అడ్డుకోవడంతో ఘర్షణ జరిగినట్లు తెలిసింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఈఘటన తరువాత సుహాసిని అర్ధాంతరంగా ప్రచారం ముగించుకుని వెనుకకు వెళ్లిపోయారు.

‘నందమూరి సుహాసినిని చిత్తు చిత్తుగా ఓడిస్తాం’

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement