![satya gang movie censor completed - Sakshi](/styles/webp/s3/article_images/2018/03/30/Sathya-gang.jpg.webp?itok=G0lEQa9q)
అక్షిత, సాత్విక్ ఈశ్వర్
గ్యాంగ్‌లో ఎవరికైనా ఏమైనా జరిగితే సత్య ఊరుకోడు. ఎందుకంటే అతనే గ్యాంగ్ లీడర్. కానీ సడన్‌గా ఓ నలుగురి గ్యాంగ్ వల్ల మర్డర్ జరుగుతుంది. అసలు.. ఈ సత్యగ్యాంగ్‌కు మర్డర్‌కి సంబంధం ఏంటి? ఆ మర్డర్ పర్పస్ ఏంటి? అనే విషయాల సమాహారంతో రూపొందిన చిత్రం ‘సత్యగ్యాంగ్’.
సిద్ధయోగి క్రియేషన్స్ పతాకంపై సాత్విక్ ఈశ్వర్, అక్షిత, ప్రత్యూష్, సుమన్, సుహాసిని, ‘కాలేకేయ’ ప్రభాకర్ ముఖ్య తారలుగా ప్రభాస్ దర్శకత్వంలో మహేశ్ ఖన్నా నిర్మించారు. సెన్సార్ కంప్లీటైంది. ‘‘కాంప్రమైజ్ కాకుండా 16 నెలలు శ్రమించి నిర్మించాం. ఈ చిత్రం ద్వారా ఓ మంచి సందేశం ఇస్తున్నాం. పాటలకు, ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది. క్లైమాక్స్‌లో అనాథల భవిష్యత్‌కు సరైన పరిష్కారం చూపటం హైలైట్. ‘సత్యగ్యాంగ్’ మంచి చిత్రంలా నిలుస్తుంది’’ అన్నారు మహేశ్‌ఖన్నా. ఈ చిత్రానికి సంగీతం: జెబి.
Comments
Please login to add a commentAdd a comment