satyagang
-
తల్లిదండ్రుల గొప్పతనం చెబుతుంది
‘‘సాధారణంగా పుట్టుకతోనే అనాథలుగా మిగిలేవారికి, పుట్టిన తర్వాత అనాథలుగా మారేవారికి సమాజంలో గుర్తింపు ఉండదు. అటువంటి వారిని పట్టించుకోకపోతే వారు నేరస్థులుగా మారే అవకాశం ఉంది. అనాథలకు సంబంధించిన కథతో తెరకెక్కిన చిత్రం ‘సత్యగ్యాంగ్’’ అని సుమన్ అన్నారు. సాత్విక్ ఈశ్వర్, అక్షిత జంటగా ప్రభాస్ దర్శకత్వంలో మహేశ్ ఖన్నా నిర్మించిన ఈ చిత్రం రేపు విడుదలవుతోంది. ఇందులో ముఖ్య పాత్ర పోషించిన సుమన్ మాట్లాడుతూ– ‘‘తల్లిదండ్రుల గొప్పతనాన్ని తెలియజేసే చిత్రమిది. నేను అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ పాత్రలో కనిపిస్తా. ఈ చిత్రంలో అనాథలపై అద్భుతమైన సాంగ్ ఉంది. చంద్రబోస్‌గారు చక్కగా రాశారు. సాత్విక్‌కి హీరోగా మంచి భవిష్యత్ ఉంది’’ అన్నారు. రాజకీయాల గురించి మాట్లాడుతూ– ‘‘ముఖ్యమంత్రి కేసీఆర్‌గారు చేస్తున్న మంచి పనులు, తెలంగాణ అభివృద్ధి నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. తెలుగు చిత్ర పరిశ్రమకు కూడా ఏదైనా చేయాలని ఆయన్ను కోరుతున్నాను. ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా విషయంలో నా మద్దతు ఉంటుంది. హోదా వద్దు స్పెషల్ ప్యాకేజ్ కావాలనుకున్న సమయంలో ప్రధాని మోదీగారితో చంద్రబాబు నాయుడుగారే మాట్లాడారు. ఇప్పుడు ప్రత్యేక హోదా కావాలంటున్నారు. అసలు.. ప్రత్యేక హోదా వల్ల ప్రజలకు కలిగే లాభాలేంటో తెలియజేస్తేనే కదా? వారికి ప్రత్యేక హోదా కావాలో? ప్రత్యేక ప్యాకేజీ కావాలో? నిర్ణయం తీసుకునేది’’ అన్నారు సుమన్. -
అనాథలు ఉండకూడదని...
‘‘చదువు అనేది జీవితంలో ఒక భాగం మాత్రమే. చదువే జీవితం కాదు. జీవితంలో తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయని ఈ చిత్రంలో చెప్పాం. ‘సత్య గ్యాంగ్’ సినిమాకి కథే మెయిన్ హీరో’’ అని నిర్మాత మహేష్ ఖన్నా అన్నారు. సాత్విక్ ఈశ్వర్, అక్షిత జంటగా ప్రభాస్ దర్శకత్వంలో రూపొందిన ‘సత్య గ్యాంగ్’ ఈ నెల 6న విడుదలవుతోంది. ఈ సందర్భంగా మహేశ్ ఖన్నా మాట్లాడుతూ– ‘‘నలుగురు అనాథ కుర్రాళ్ల వల్ల ఒక ్రౖకైమ్ జరుగుతుంది. దానివల్ల వాళ్లెలాంటి ఇబ్బందులు పడ్డారు? అన్నదే సినిమా. గ్యాంగ్ వార్స్, లవ్ ట్రాక్ ఉంటుంది. భవిష్యత్తులో సమాజంలో అనాథలు ఉండకూడదని మా చిత్రం ద్వారా చెబుతున్నాం. ఈ చిత్రానికి కథ, మాటలు రాయడంతో పాటు దర్శకత్వ పర్యవేక్షణ కూడా చేశా. ఎన్నో సినిమాల్లో నటించిన నేను తొలిసారి ఈ సినిమా నిర్మించా. కమర్షియల్ పాయింటాఫ్ వ్యూలో కాకుండా ప్రజలకు ఉపయోగపడేలా సినిమా తీశాం. భారతదేశంలోని యువత ఏ విధంగా ఉండాలి? పొరపాటు చేస్తే దాని పర్యవసానం ఎలా ఉంటుందని చూపించాం. సినిమా ప్రభావం సమాజంపై ఉంటుందని నా నమ్మకం. అందుకే ఈ చిత్రం ద్వారా మంచి సందేశం ఇచ్చే ప్రయత్నం చేశాం. 150 థియేటర్లలో సినిమాను విడుదల చేయనున్నాం’’ అన్నారు. -
సరైన పరిష్కారం!
గ్యాంగ్‌లో ఎవరికైనా ఏమైనా జరిగితే సత్య ఊరుకోడు. ఎందుకంటే అతనే గ్యాంగ్ లీడర్. కానీ సడన్‌గా ఓ నలుగురి గ్యాంగ్ వల్ల మర్డర్ జరుగుతుంది. అసలు.. ఈ సత్యగ్యాంగ్కు మర్డర్‌కి సంబంధం ఏంటి? ఆ మర్డర్ పర్పస్ ఏంటి? అనే విషయాల సమాహారంతో రూపొందిన చిత్రం ‘సత్యగ్యాంగ్’. సిద్ధయోగి క్రియేషన్స్ పతాకంపై సాత్విక్ ఈశ్వర్, అక్షిత, ప్రత్యూష్, సుమన్, సుహాసిని, ‘కాలేకేయ’ ప్రభాకర్ ముఖ్య తారలుగా ప్రభాస్ దర్శకత్వంలో మహేశ్ ఖన్నా నిర్మించారు. సెన్సార్ కంప్లీటైంది. ‘‘కాంప్రమైజ్ కాకుండా 16 నెలలు శ్రమించి నిర్మించాం. ఈ చిత్రం ద్వారా ఓ మంచి సందేశం ఇస్తున్నాం. పాటలకు, ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది. క్లైమాక్స్‌లో అనాథల భవిష్యత్‌కు సరైన పరిష్కారం చూపటం హైలైట్. ‘సత్యగ్యాంగ్’ మంచి చిత్రంలా నిలుస్తుంది’’ అన్నారు మహేశ్‌ఖన్నా. ఈ చిత్రానికి సంగీతం: జెబి. -
సినిమా నచ్చకపోతే డబ్బులు వెనక్కి!
‘‘అనాథలకు సంబంధించిన కథతో రూపొందిన చిత్రం ‘సత్యగ్యాంగ్’. ఈ చిత్రంలో చంద్రబోస్‌గారు అనాథలపై రాసిన పాట బాగుందని అందరూ అంటున్నారు. మా నాన్నగారి జ్ఞాపకార్థం కోటీ యాభైలక్షలు విలువ చేసే స్థలాన్ని అనాథలకు ఉచితంగా ఇచ్చా. మా సినిమా చూడండి. బాగా లేకపోతే టికెట్ డబ్బులు తిరిగి ఇచ్చేస్తా’’ అని నిర్మాత మహేశ్ ఖన్నా అన్నారు. సాత్విక్ ఈశ్వర్, అక్షిత జంటగా ప్రభాస్ దర్శకత్వంలో మహేశ్ ఖన్నా నిర్మించిన‘సత్యగ్యాంగ్’ త్వరలో విడుదల కానుంది. పాటల రచయిత చంద్రబోస్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో అనాథలపై ఓ మంచి పాట రాశా. ఇందుకు మహేశ్ ఖన్నాగారికి, ప్రభాస్‌గారికి థ్యాంక్స్. నా పాట విని, కీరవాణిగారు అభినందించడం సంతోషంగా ఉంది’’ అన్నారు. ‘సత్యగ్యాంగ్’ వంటి మంచి సినిమాతో హీరోగా పరిచయమవుతుండడం గర్వంగా ఉంది’’ అన్నారు సాత్విక్ ఈశ్వర్. ఈ చిత్రానికి నిర్మాత–దర్శకత్వ పర్యవేక్షణ: మహేష్ ఖన్నా, సంగీతం–దర్శకత్వం: ప్రభాస్. -
వినోదాత్మక సందేశం
సాత్విక్ ఈశ్వర్, అక్షిత జంటగా రూపొందిన చిత్రం ‘సత్యగ్యాంగ్’. ఈ చిత్రానికి ప్రభాస్ దర్శకత్వం వహించడంతో పాటు సంగీతం అందించారు. మహేష్ ఖన్నా నిర్మాత. ఈ సినిమా ఆడియో సక్సెస్‌మీట్ కర్నూలులో నిర్వహించారు. మహేష్ ఖన్నా మాట్లాడుతూ– ‘‘సమాజంలో అనాథలనేవారు ఉండకూడదనే సందేశానికి వినోదాన్ని మేళవించి రూపొందించిన చిత్రమిది. మా డైరెక్టర్ ప్రభాస్ మ్యూజిక్ డైరెక్టర్‌గానూ మంచి మార్కులు సంపాదించారు. మార్చి 15న సినిమా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ‘‘సినిమా బాగా వచ్చిందన్నా.. మ్యూజిక్‌కి చాలా మంచి రెస్పాన్స్ వస్తోందన్నా అందుకు కారణం మా నిర్మాత మహేష్ ఖన్నా’’ అన్నారు ప్రభాస్. ‘‘ సాత్విక్ ఈశ్వర్, అక్షిత, సినిమాటోగ్రాఫర్ అడుసుమిల్లి విజయ్‌కుమార్ పాల్గొన్నారు. -
నచ్చకుంటే డబ్బు వాపసు
సొసైటీలో అనాథలను లేకుండా చేయాలనే సందేశాత్మక కథకి వినోదం జోడించి రూపొందించిన సినిమా ‘సత్య గ్యాంగ్’. సాత్విక ఈశ్వర్, అక్షిత జంటగా ప్రభాస్ దర్శకత్వంలో మహేశ్ ఖన్నా నిర్మించిన ఈ సినిమా టీజర్‌ని అనాథ బాలల చేత విడుదల చేయించారు. ఈ సందర్భంగా మహేశ్ ఖన్నా వారికి రూ. 10 వేలు ఆర్థిక సాయం చేశారు. ‘‘మంచి కథాంశంతో రూపొందిన చిత్రమిది. మా సినిమా చూసి నచ్చలేదన్నవారికి డబ్బులు వాపసు ఇచ్చేస్తాం. సినిమాపై మాకున్న నమ్మకం వల్ల ఇలా అంటున్నాం. త్వరలోనే ఆడియో లాంచ్ చేస్తాం’’ అన్నారు మహేశ్ ఖన్నా. -
అనాథలు లేని సమాజం కోసం
సాత్విక ఈశ్వర్ని హీరోగా పరిచయం చేస్తూ ప్రభాస్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సత్య గ్యాంగ్’. అక్షిత కథానాయిక. సిద్ధయోగి క్రియేషన్స్ పతాకంపై మహేష్ ఖన్నా నిర్మిస్తున్న ఈ సినిమా చివరి షెడ్యూల్ జరుగుతోంది. ఈ చిత్రం నిర్మించడంతో పాటు దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్న మహేష్ ఖన్నా మాట్లాడుతూ– ‘‘సమాజంలో అనాథలనేవారు ఉండకూడదనే కథాంశంతో రూపొందుతోన్న చిత్రమిది. సందేశానికి వినోదాన్ని మేళవించి తీస్తున్నాం. సుమన్, సుహాసినిలపై ప్రస్తుతం కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాం. సాత్విక ఈశ్వర్‌కి చాలా మంచి భవిష్యత్ ఉంది. మరో వారం పాటు జరిగే షూటింగ్‌తో పాటలు సహా సినిమా పూర్తవుతుంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులూ జరుగుతున్నాయి. త్వరలో పాటలు విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ప్రత్యూష్, హర్షిత, ప్రభాకర్, షఫీ, జీవా, వినోద్, మహేష్ ఖన్నా తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: అడుసుమిల్లి విజయ్ కుమార్, సంగీతం–దర్శకత్వం: ప్రభాస్. -
డోన్‌లో ‘సత్యాగ్యాంగ్’
డోన్ టౌన్: సిద్ధయోగి సినీ కంబైన్స్ పతాకంపై ఎంకే టౌన్ షిప్ అధినేత మహేశ్‌ఖన్నా నిర్మిస్తున్న ‘సత్యాగ్యాంగ్’ చిత్రం షూటింగ్ డోన్ ఎస్కేపీ హైస్కూల్ ఆవరణలో శనివారం నిర్వహించారు. కిషన్కన్నయ్య దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో హీరోలు అర్షిత్, హర్పిత్, హీరోయిన్లు ప్రత్యూష, స్వాతిక నటిస్తున్నారు. జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణ హాజరై చిత్ర యూనిట్‌ను అభినందించారు. జిల్లాలో పలు ప్రాంతాలు చిత్ర షూటింగ్‌కు అనుకూలంగా ఉన్నాయన్నారు.