అనాథలు ఉండకూడదని... | producer mahesh khanna about satyagang movie | Sakshi
Sakshi News home page

అనాథలు ఉండకూడదని...

Published Tue, Apr 3 2018 12:38 AM | Last Updated on Tue, Aug 28 2018 4:32 PM

producer mahesh khanna about satyagang movie - Sakshi

మహేష్‌ ఖన్నా

‘‘చదువు అనేది జీవితంలో ఒక భాగం మాత్రమే. చదువే జీవితం కాదు. జీవితంలో తెలుసుకోవాల్సినవి  చాలా ఉన్నాయని ఈ చిత్రంలో చెప్పాం. ‘సత్య గ్యాంగ్‌’ సినిమాకి కథే మెయిన్‌ హీరో’’ అని నిర్మాత మహేష్‌ ఖన్నా అన్నారు. సాత్విక్‌ ఈశ్వర్, అక్షిత జంటగా ప్రభాస్‌ దర్శకత్వంలో రూపొందిన ‘సత్య గ్యాంగ్‌’ ఈ నెల 6న విడుదలవుతోంది. ఈ సందర్భంగా మహేశ్‌ ఖన్నా మాట్లాడుతూ– ‘‘నలుగురు అనాథ కుర్రాళ్ల వల్ల ఒక ్రౖకైమ్‌ జరుగుతుంది. దానివల్ల వాళ్లెలాంటి ఇబ్బందులు పడ్డారు? అన్నదే సినిమా. గ్యాంగ్‌ వార్స్, లవ్‌ ట్రాక్‌ ఉంటుంది.

భవిష్యత్తులో సమాజంలో అనాథలు ఉండకూడదని మా చిత్రం ద్వారా చెబుతున్నాం. ఈ చిత్రానికి కథ, మాటలు రాయడంతో పాటు దర్శకత్వ పర్యవేక్షణ కూడా చేశా. ఎన్నో సినిమాల్లో నటించిన నేను తొలిసారి ఈ సినిమా నిర్మించా. కమర్షియల్‌ పాయింటాఫ్‌ వ్యూలో కాకుండా ప్రజలకు ఉపయోగపడేలా సినిమా తీశాం.  భారతదేశంలోని యువత ఏ విధంగా ఉండాలి? పొరపాటు చేస్తే దాని పర్యవసానం ఎలా ఉంటుందని చూపించాం. సినిమా ప్రభావం సమాజంపై ఉంటుందని నా నమ్మకం. అందుకే ఈ చిత్రం ద్వారా మంచి సందేశం ఇచ్చే ప్రయత్నం చేశాం. 150 థియేటర్లలో సినిమాను విడుదల చేయనున్నాం’’ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement